Tuesday, January 7, 2025

Story : హైవే విస్తరణకు బ్లాస్టింగ్‌.. భయాందోళనలో ప్రజలు

  • మన్యంలో మారుమ్రోగిన బ్లాస్టింగ్‌ మోత
  • ఉలిక్కపడ్డ ప్రయాణికులు, వాహనదారులు
  • ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వైనం


ఏఎస్‌ఆర్‌ జిల్లా ప్రతినిధి (ఆంధ్రప్రభ) : విజయవాడ – జగదల్‌పూర్‌ 326 జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఈ పనుల్లో భాగంగా సదరు గుత్తేదారుడు రహదారికి అడ్డంగా ఉన్న బండ రాళ్ళను పగులగొట్టేందుకు బ్లాస్టింగ్‌ చేస్తున్నారు. ఈ బ్లాస్టింగ్ తో మన్యంలో బాంబుల మోత మారుమ్రోగింది. వివరాల్లోకి వెళితే భద్రాచలం నుండి చిడుమూరు వరకు సుమారు 58 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. జాతీయ రహదారి విస్తరణలో అక్కడక్కడ రహదారికి అడ్డంగా పెద్ద పెద్ద బండ రాళ్ళు అడ్డు వస్తున్నాయి. ఈ బండరాళ్ళను అడ్డు తోలగించేందకు సదరు గుత్తేదారుడు ఏకంగా ఏజేన్సీలో బ్లాస్టింగ్‌లు చేయడం ఇప్పుడు చర్చాంశనీయంగా మారింది.

అసలే మన్యం.. ఒక పక్క మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో ఈ బ్లాస్టింగ్‌ మోతలు విన్న మన్యం వాసులు ఒక్కసారిగా భయాందోళనకు గురైనట్లు తెలుస్తోంది. చింతూరు – భద్రాచలం ప్రధాన రహదారిలో బోడ్డుగూడెం – ఏడుగుర్రాలపల్లి గ్రామాల మధ్యలో జాతీయ రహదారి విస్తరణ పనులకు అడ్డంగా ఉన్న అతి పెద్ద రాతి బండలను బద్దలు కొట్టడానికి రహదారి పనులు నిర్వహించే గుత్తేదారుడు బ్లాస్టింగ్‌ చేసిన విషయం బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

జాతీయ రహదారిలో మధ్యాహ్నాం తరువాత 3 నుండి 3.30 గంటల సమయంలో ఈ బ్లాస్టింగ్‌ చేసినట్లు ప్రత్యేక్ష సాక్షులు పేర్కోన్నారు. పెద్ద బండ రాళ్ళను తొలగించే క్రమంలో బ్లాస్టింగ్‌ చేసే సమయంలో సుమారు 30 నిమిషాల పాటు భద్రాచలం నుండి చింతూరు వైపు వచ్చే వాహనాలను, చింతూరు నుండి భద్రాచలం వైపు వెళ్ళే వాహనాలను సదరు నిర్వాహకులే నిలిపివేసి బ్లాస్టింగ్‌ చేసినట్లు వాహనదారులు, ప్రయాణికులు తెలిపారు.

- Advertisement -

ఏడుగుర్రాలపల్లి – బోడ్డుగూడెం గ్రామాల మధ్య మొత్తం అటవీ ప్రాంతం కావడంతో ఈ ప్రాంతం మావోయిస్టుల ప్రభావిత ప్రాంతం కావడంతో ఏ ఒక్క అధికారి బ్లాస్టింగ్‌ సమయంలో అక్కడ లేకపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యామని వాపోయారు. జాతీయ విస్తరణ పనులు నిర్వహించేటప్పుడు కానీ, బ్లాస్టింగ్‌ చేసే సమయంలో కానీ ఏ ఒక్క అధికారి పనులను పర్యవేక్షించిన దాఖలాలు కనిపించడం లేదనే ఆరోపణలు సైతం సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై జాతీయ రహదారి కాకినాడ డివిజన్ సహాయ ఇంజనీర్ చక్రవర్తిని వివరణ కోరగా.. బ్లాస్టింగ్ చేసేటప్పుడు తప్పనిసరిగా అధికారులు ఉండాలని అనుమతులు సైతం ఉండాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement