నందిగామ – మొదటి భార్య ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నాడంటూ భర్త మర్మాంగాలను రెండో భార్య బ్లేడ్‌తో కోసేసింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామానికి చెందిన కోట ఆనంద్ బాబు.. మనస్పర్థలతో భార్యను విడిచిపెట్టాడు. ఒంటరిగా ఉన్న ఆనంద్ బాబు ఐదేండ్ల క్రితం వరమ్మ అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. నిన్న రాత్రి ఆనంద్ తన మొదటి భార్య వీడియోలను ఇన్‌స్టాలో చూస్తుండటంతో వరమ్మకు కోపం వచ్చింది. ఎందుకు ఆమె రీల్స్ చూస్తున్నావంటూ ప్రశ్నించింది. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆగ్రహావేశాలకు లోనైన భార్య.. నిద్రిస్తున్న భర్తపై దాడి చేసింది. భర్త మర్మాంగాలను బ్లేడ్‌తో కోసి గాయపరిచింది.
తీవ్ర రక్తస్రావం కావడంతో బాధితుడిని నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఆనంద్ బాబును విజయవాడ ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.