Thursday, November 21, 2024

హ్యూమిడిఫైర్లను శుభ్రం చేయకపోవడంతోనే బ్లాక్‌ ఫంగస్‌

హైద‌రాబాద్ – కరోనా చికిత్సలో భాగంగా వినియోగించే ఆక్సిజన్‌ హ్యూమిడి ఫైర్లను నిత్యం శుభ్రం చేయకపోవడంతో మ్యూకోర్మైకోవిస్‌ (బ్లాక్‌ ఫంగస్‌) వ్యాధి సోకుతోంది. ఈ పరిస్థితుల్లో బ్లాక్‌ ఫంగస్‌ వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు చేపట్టాలని డీఎంఈ రమేష్‌రెడ్డి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్‌లకు ఆదేశాలు జారీ చేశారు. ఆక్సిజన్‌ బెడ్లపై చికిత్స పొందిన వారిని బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధి వెంటాడుతోంది. ప్రస్తుతం తెలంగాణలో బ్లాక్‌ ఫంగస్‌ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ అరుదైన ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ సోకితే 50శాతం కంటే ఎక్కువగా మరణాలు సంభవిస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధి ఎక్కు వ రోజులు ఆక్సిజన్‌ చికిత్స పొందినవారికి సోకు తోంది. ఆక్సిజన్‌ను వినియోగించిన పేషెంట్లు ఊపిరి తీసుకుని గాలిని బయటకు వదిలినపుడు హ్యూమిడిఫైయర్‌పై ముకోర్మైకోసిస్‌ (బ్లాక్‌ ఫంగస్‌) ఏర్పడుతోంది. ఆసుపత్రి సిబ్బంది ఎప్పటికప్పుడు దాన్ని స్టెరైల్‌ వాటర్‌ ద్వారా శుభ్రపరచాల్సి ఉంటుంది. కాని కోవిడ్‌ పేషెంట్ల తాకిడి పెరగడంతో హ్యూమిడిఫైయ ర్లను శుభ్రపరచడంపై సిబ్బంది నిర్లక్ష్యం చూపుతున్నారు. దీంతో రోజుల తరబడి పేరుకుపోయిన బ్లాక్‌ ఫంగస్‌ ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తోంది. డయాబెటీస్‌ చికిత్సకు అధికంగా స్టెరా యిడ్స్‌ వినియోగించడం కారణాన కూడా బ్లాక్‌ ఫంగస్‌ సోకుతోంది. బ్లాక్‌ ఫంగస్‌ సోకినపేషెంట్‌ లలో ముఖం వాపు, తలనొప్పి, జ్వరం, కళ్ల వాపు, అవయవాల్లో నల్లటి మచ్చలు, ముక్కు ఒక వైపు మూసుకు పోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. శరీరంలోకి ప్రవేశించిన ఈ ఫంగస్‌ సైనస్‌లో చేరి ఆ తర్వా తకండ్లపై దాడి చేస్తోంది. దాంతో కంటి చూపు మందగిస్తోంది. కళ్లలోకి చేరిన 24 గంటల్లోపే మెదడులోకి ప్రవేశించడం, బ్రెయిన్‌ డెడ్‌ కావడంతో పేషెంట్లు చనిపోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement