Monday, November 18, 2024

రమ్య హత్యపై జాతీయ ఎస్సీ కమిషన్ విచారణ

ప్రేమోన్మాది చేతిలో బలి అయిన బీటెక్ విద్యార్థిని రమ్య ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రమ్య హత్య కేసుపై విచారణ జరిపిందేకు జాతీయ ఎస్సీ కమిషన్ మంగళవారం ఉదయం రమ్య ఇంటికి చేరుకుంది. కాగా కమిషన్ వెంట వైసీపీ నేతల వాహానాలను పంపడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో బీజేపీ మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, మహిళలు మధ్య తోపులాట జరిగింది. బీజేపీ నేత యామిని రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. 

కాగా, ఇటీవల గుంటూరులో పట్టపగలు జరిగిన బీటెక్‌ విద్యార్థిని రమ్య దారుణ హత్య రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. దీనిపై జాతీయ ఎస్సీ కమిషన్‌ స్పందించి స్పాట్‌ విచారణకు ప్రత్యేక బృందాన్ని నియమించింది. ఈ బృందం మంగళవారం గుంటూరులో పర్యటిస్తోంది. 

అంతకుముందు.. జాతీయ ఎస్సీ కమిషన్‌ను తెలుగుదేశం పార్టీ నాయకులు కలిశారు. గుంటూరులో రమ్య  ఘటన, రాష్టంలో దళితులపై జరుగుతున్న అకృత్యాలను టీడీపీ నేతలు కమిషన్ ముందు ఉంచారు. వర్ల రామయ్య, నక్క ఆనంద్ బాబు, తెనాలి శ్రావణ్ కుమార్,తంగిరాల సౌమ్య… కమిషన్‌ను  కలిసిన వారిలో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement