Tuesday, November 19, 2024

BJP Visit – రేపు వ‌స్తున్నాం… పార్వేటి మండ‌పాన్ని చూస్తాంః బిజెపి

తిరుపతి, నవంబర్ 6 (ప్రభ న్యూస్ బ్యూరో) తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పురావస్తు పరిశోధన శాఖ అనుమతి లేకుండా తిరుమలలో కూల్చేసి. నూతనంగా తిరిగి నిర్మించిన ఫార్వేటి మండపం స్థితి గతి భవిష్యత్తులపై పరిశీలనకు రమ్మని కోరడాన్ని తాము సమతించి , రేపు ఉద‌యం ఫార్వేటి మండపానికి విచ్చేస్తున్నామని భాజపా నేతలు భాను ప్రకాష్ రెడ్డి , డాక్టర్ శ్రీహరీరావు , వరప్రసాద్ , శరత్ , రవి , నవీన్ తదితరులు వెల్లడించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో సోమవారం మీడియాతో మాట్లాడుతూ. వరంగల్లులోని ఆర్కియాల‌జీ డిపార్ట్ మెంట్ నిపుణులు కాకతీయ రాజులు నిర్మించిన పురాతన కట్టడాలను కూల్చేయకుండా మరో. 500 సంవత్సరాలు ఆనాటి జ్ఞాపకాలను చెక్కుచెదరనీకుండా ఆల్ట్రేషన్ చేసారని తెలియజేశారు.

చరిత్ర కలిగిన పురాతన కట్టడాలను ఎవరి అనుమతి తీసుకోకుండా కూల్చివేసి , కట్టడం మంచిది కాదన్నారు. పార్వేటి మండపం పునర్ నిర్మాణం పై టిటిడి ఈవో లోటుబాట్లపై చర్చకు రమ్మని పిలిచారని , ఈవో పిలుపు మేరకు తాము విచ్చేస్తున్నామన్నారు. అదేవిధంగా కాకతీయ సామ్రాజ్యం. వరంగల్ లో పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో పల్లవులు , చోళులు , విజయనగర సామ్రాజ్యాతి పతులు అలనాడు నిర్మించిన కట్టడాలను మరో 500 సంవత్సరాలు చరిత్రలో కొనసాగేలా అప్పటి కట్టడాలకు తిరిగి జీవం పోస్తున్నారని అన్నారు.. టీటీడీ యాజమాన్యం కూడా కాకతీయ రాజ్య పురాతన కట్టడాలను పరిశీలించేందుకు టీటీడీ ని ఆహ్వానిస్తున్నామ‌న్నారు.. వారు ఉప‌యోగించిన సాంకేతిక‌ను వినియోగించి టిటిడి పురాత‌న క‌ట్ట‌డాల‌ను ప‌రిర‌క్షించాల‌ని అన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement