( ఆంధ్రప్రభ స్మార్ట్, ఏలూరు బ్యూరో) పశ్చిమగోదావరిజిల్లా నర్సాపురం ఎంపిగా ఎన్నికైన బీజేపీ రాష్ట్రకార్యదర్శి భూపతిరాజుశ్రీనివాసవర్మకు కేంద్రమంత్రివర్గంలో స్థానందక్కింది కేంద్రసహాయమంత్రి హోదాలో ఆదివారంరాత్రి ప్రమాణస్వీకారం చేయనున్నారు పశ్చిమగోదావరిజిల్లా నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న శ్రీనివాసవర్మకు కేంద్రమంత్రివర్గంలో స్థానం లభించడంపట్ల బీజేపీ శ్రేణుల్లోను జిల్లా ప్రజలలోను హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
భూపతి రాజు శ్రీనివాసవర్మ
2009లోను నరసాపురం బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఓడిపోయారు. 2024 లో ఎన్డీఏ అభ్యర్థిగా రెండు లక్షల 76 వేల మెజార్టీతో ఘనవిజయం
భూపతి రాజు శ్రీనివాస్ వర్మక్షత్రియ వర్గానికి చెందిన వ్యక్తి… 1967 ఆగస్టు 4న నాలుగో తేదీన భూపతి రాజు సూర్యనారాయణరాజు దంపతులకు భీమవరంలో జన్మించారు.డబుల్ ఎంఏ చేశారు. ఎం ఎల్ లిటరేచర్, బిఎల్ కూడా చేశారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో దిట్ట.
1991లో బీజేపీలో చేరారు. 1995 వరకు బీజేవైఎం జిల్లా ప్రెసిడెంట్ గా, 95 నుంచి97 వరకు భీమవరం టౌన్ పార్టీ ప్రెసిడెంట్ గా, 97 నుంచి 99 వరకు పార్టీ జిల్లా కార్యదర్శిగా,, 99 నుంచి 2001 వరకు నర్సాపురం పార్లమెంటు కన్వీనర్ గా, 2001 నుంచి 2003 వరకు బీజేపీ నేషనల్ కౌన్సిల్ మెంబర్ గా, 2003 నుండి 2009 వరకు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ, 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ ఎంపీగా పోటీ చేసి పరాజయం చెందారు.
2010 నుంచి 2018 వరకు పశ్చిమగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షులుగా, 2018 నుండి 2020 వరకు పశ్చిమగోదావరి జిల్లా ఇన్చార్జిగా, 2020 నుంచి 2023 వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. 2024 ఎన్నికల్లో అనూహ్యంగా చివరి నిమిషంలో నరసాపురం ఎంపీ అభ్యర్థిగా సీటు దక్కించుకొని రెండు లక్షల 76 వేల కు పైగా ఓట్ల మెజార్టీతో ఎంపీగా భారీ విజయం సాధించారు.