jక్రొసూరు – ఏపీలో విధ్వంసకర, విద్వేషపూరిత, కక్షపూరిత పరిపాలన సాగుతోందని,అందుకే . ఒక్క పెట్టుబడి కూడా రాష్ట్రానికి రాలేదని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. కృష్ణా జిల్లా క్రోసూరు గ్రామంలో జరిగిన గావ్ చలో కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, పరిశ్రమలు రాకపోవడంతో ఇక్కడ పిల్లలకు ఉపాధి లేకుండా పోయింది..
రాష్ట్రంలో, గ్రామాల్లో అంతర్గత రహదారులు బాగుండడంలేదన్నారు.. కేంద్ర ప్రభుత్వం నిర్మించిన రహదారులు మాత్రమే సవ్యంగా, బ్రహ్మాండంగా ఉన్నాయి.. కానీ, ఆ రోడ్లను దిగితే.. చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయన్నారు.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి గ్రామాల అభివృద్ధికి ఇచ్చిన నిధులు పక్కదారి పట్టించింది అని ఆరోపించారు.. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో కనీసం రోడ్ల నిర్మాణం కూడా చేయలేని దుస్థితిలో ఉంది.. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు టిడ్కో ఇల్లు ఇవ్వకుండా ప్రజలను మోసం చేసింది. నిరుద్యోగులను కూడా ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు.. రాష్ట్రంలో ఆక్వా రైతులను కూడా మభ్యపెట్టి విద్యుత్ చార్జీలను తగ్గిస్తామని చెప్పి మోసం చేసిన విషయాన్ని గుర్తు చేశారు.. మద్యపానం నిషేధం అని చెప్పి.. నేడు అధిక రేట్లకు మద్యాన్ని పారిస్తున్నారు అంటూ దుయ్యబట్టారు దగ్గుబాటి పురంధేశ్వరి..
అంతకు ముందు ఆమె ఆ గ్రామంలో పర్యటించారు.. రైతులతో ఆమె కొంత సేపు మాట్లాడారు… కేంద్ర పథకాలు అందుతున్నాయా అని వారిని అడిగి తెలుసుకున్నారు..