Monday, November 25, 2024

బీజేపీ ఎంపీని తక్షణమే అరెస్టు చేయాలి.. రెజ్లర్ల ఆందోళనకు ప్రజాసంఘాల మద్దతు

కర్నూల్ నగరంలోని అవుట్ డోర్ స్టేడియం ముందు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రెజ్లర్ల క్రీడాకారులపై లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్ పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని కోరుతూ ఢిల్లీ జంతర్ మంతర్ లో రెజ్ల‌ర్లు ఆందోళన చేస్తున్నారు. రెజ్లర్ల క్రీడాకారులకు మద్దతుగా ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, ఐద్వా, సిఐటియు, రైతు సంఘం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేశారు.

ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాధాకృష్ణ, అంజిబాబు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ, ఐద్వా జిల్లా కార్యదర్శి అలివేలు, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్, జిల్లా కార్యదర్శి అబ్దుల్లా మాట్లాడుతూ… దేశ ప్రతిష్టను పెంచడం కోసం అనేక పథకాలు సాధించిన రెజ్లర్ల క్రీడాకారులు 26 రోజులుగా ఢిల్లీలో ఆందోళన చేస్తున్నా.. ఏమి ఎరగనట్లు దేశ ప్రతిష్ట కోసం కృషి చేసిన వాళ్ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అందుకే ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో వారికి మద్దతుగా నిరసన ప్రదర్శనలు, సంతకాల సేకరణలు చేస్తున్నామని తెలిపారు. తక్షణమే లైంగిక వేధింపులకు బ్రిజ్ భూషణ్ శరన్ సింగ్ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బీజేపీ ఎంపీ పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దేశవ్యాప్తంగా ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు నరసింహులు కుమార్, ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షులు అమర్, ప్రజా సంఘాల నాయకులు గోపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement