Tuesday, November 26, 2024

ధాన్యం కొనుగోలు సమాచారం ఏదీ?

ఏపీలో రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వ తీరుపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఏపిలో ప్రభుత్వం మాటలకు చేతలకు పొంతన లేదన్నారు. పౌరసరఫరాలశాఖ రబీ పంటకు సంబంధించి 45లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటున్నామని ప్రకటించి…నేటికి కేవలం 25లక్షల 25వేల 927 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారని తెలిపారు. రైతుల ధాన్యానికి చెల్లించాల్సిన బకాయిలు పౌరసరఫరాల శాఖ ఎందుకుచెల్లించడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ చర్యలు పరోక్షంగా మిల్లర్లకు, మద్యదళారులు సహకరించడం కాదా ? అని అడిగారు. రాజకీయ ముసుగులో ఉన్న మిల్లర్లు చేతిలో ప్రభుత్వం కీలుబొమ్మగామారి రైతులకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

‘మంత్రి కొడాలి నాని గారు, మీ వైఎస్సార్ సీపీ పార్టీ ప్రభుత్వం రైతుల ధాన్యం కొనుగోలు సమాచారం ఎందుకు చెప్పడం లేదు? ఈ విషయాలపై మీరు మీడియా ముందుకు ఎందుకు రావడం లేదు? 45 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తామ‌ని ప్ర‌భుత్వం చెప్పింది. 25 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నులు మాత్ర‌మే కొనుగోలు చేసింది. ఒక‌వైపు స‌ర‌స‌మైన ధ‌ర‌ల‌కు అమ్ముకోవాల‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. మ‌రోవైపు 25 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నులు మాత్ర‌మే కొనుగోలు చేసింది. అది కూడా బ‌కాయిలు ఇంకా చెల్లించాల్సి ఉంది. పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి దీని గురించి మాట్లాడ‌డం లేదు. ధాన్యం కొనుగోలు విష‌యంపై మంత్రి కొడాలి నాని మాట్లాడాలి. ద‌ళారుల ముసుగులో వైసీపీ నేత‌లు ఉన్నారు. ప్ర‌భుత్వం వెంట‌నే ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. లేదంటే ఆందోళ‌న‌లకు దిగుతాం’ అని విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement