బద్వేల్ లో పోలీసులకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు పెద్ద తేడా ఏమీ లేదని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. వైసీపీ కార్యకర్తల కంటే ఘోరంగా పోలీసులు వైసిపి పార్టీకి సహకరిస్తున్నారని ఆరోపించారు. నాడు తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ రకంగా దొంగ ఓట్లు వేశారో దాన్నే బద్వేలులో పునరావృతం చేస్తున్నారని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే గోవిందరెడ్డి హౌస్ అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దొంగ ఓట్లతో గెలిచేది.. ఓ గెలుపేనా ?అని ప్రశ్నించారు. పోలీసులులే దొంగ ఓట్లను ప్రోత్సహించడం సిగ్గుచేటని విమర్శించారు. మాజీ ఎమ్మెల్సీ గోవిందరెడ్డిని ఎందుకు అన్ని మండలాల్లో తిరగడానికి పోలీసులు అనుమతిస్తున్నారు? అని విష్ణువర్ధన్ రెడ్డి నిలదీశారు.
ఇది కూడా చదవండి: బద్వేల్ ఉపఎన్నిక: అట్లూరులో దొంగ ఓట్లు