Sunday, November 17, 2024

ఏపీలో బిజెపి కీలకంగామారబోతోంది- ఏపీకి అమ‌రావ‌తే రాజ‌ధాని- సీఎం రమేష్

ఆంధ్రప్రభ, కడప : ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ కీలకంగా మారబోతోందని ఆపార్టీనేత,రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ పేర్కొన్నారు. ఏపీలో అవినీతి అక్రమాలు,ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై పోరాటాలు సాగిస్తామన్నారు.శుక్రవారం కడపలోని ఆర్ @బి అతిథి గృహంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ..సీఎం జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు.రాష్ట్రంలో
శాంతిభద్రతల తీవ్రంగా మారాయని,మట్కా, గుట్కా వ్యాపారం జోరుగా సాగుతోందని ఆరోపించారు.అభివృద్ధి పరంగా చూస్తే ఆయన సొంత జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామన్న హమీ ఏమైందన్నారు.మూడేళ్లైనా అతీగతీ లేకుడాపోయిందన్నారు. కేంద్ర ప్రభుత్వం 67శాతం సబ్సిడీ ఇస్తుంటే రైతులకు డ్రిప్ సౌకర్యం కల్పించకపోవడం సిగ్గు చేటన్నారు.గ్రామ పంచాయతీ నిధులను ఇతర పథకాలకు మళ్లించడంపై వైసీపీ సర్పంచ్ లలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. రాష్ట్రంలో వైసీపీ నేతలు అభివృద్ధి చెందారే తప్ప.. అభివృద్ధి చేసింది శూన్యమన్నారు.రాష్ట్రంలో ప్రజల మధ్య‌ చిచ్చుపెట్టడం తగదన్నారు.ఆంధ్రప్రదేశ్ కు అమరావతే రాజధాని అని అన్నారు.

రాష్ట్రంలోని ఐదువేల ప్రాంతాల్లో ప్రజాపోరు..

రాష్ట్రంలో ఐదువేల గ్రామల్లో ప్రజా పోరు నిర్వహిస్తామన్నారు.అమిత్ షా ఆద్వర్యంలో పెద్ద సభ ఏర్పాటు చేయనున్నామని సీఎం రమేష్ తెలిపారు. బీజేపీని బలపరిచే దిశగా ప్రజాపోరుతో చైతన్యం తీసుకోస్తాం అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో ఫ్లైఓవర్ లు నిర్మిస్తే వాటిని రాష్ట్ర ప్రభుత్వం చేసినట్లు చెప్పుకోవడానికి సిగ్గులేదా అని ప్రశ్శించారు. ఏపీలో మీరేం అభివృద్ధి చేశారో చెప్పగలరా అంటూ మంత్రులకు, ఎమ్మెల్యేలకు సవాల్ విసిరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement