Tuesday, November 26, 2024

BJP Counter – ఏపీని అప్పుల ఊబిలోకి నెట్టారు – పురందేశ్వరీ

ప్రతి వ్యక్తిపై రూ.2 లక్షల రుణభారం
పనికి మాలిన మద్యంతో
కేజీహెచ్‌లో 534 మంది చేరారు
జనం మార్పు కోరుతున్నారు
ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరీ

( ఏలూరు బ్యూరో, ప్రభన్యూస్) – ఐదేళ్ల ప్రభుత్వ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశర్వి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరులో శుక్రవారం విలేఖరులతో మాట్లడుతూ,రాష్ట్రంలో ప్రతీ వ్యక్తిపై రూ. 2 లక్షల భారం ఉందన్నారు. రాష్ట్ర సచివాలయం, గనులను తాకట్టు పెట్టేందుకు సీఎం జగన్ రెడీ అవుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో నాణ్యత లేని మద్యం అమ్ముతున్నారని, దాని వల్ల చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. విశాఖ కేజీహెచ్‌లో 534 మంది మద్యం తాగి అనారోగ్యం పాలయ్యారని, వారిలో 200 మంది చనిపోయేలా ఉన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

జనం మార్పు కోరుతున్నారు
రాష్ట్రంలోని పరిస్థితుల దృష్ట్యా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని పురందేశ్వరి అన్నారు. మే 13 తర్వాత రాష్ట్రంలో ఈ మార్పు మొదలు అవుతుందని, మార్పు కోరుకునే ప్రతి ఒక్కరూ ఎన్ డి ఏ కూటమికి మద్ధతు పలకాలన్నారు. దేవాదాయ శాఖలో పనిచేసే ఉద్యోగులను ఎన్నికల విధుల్లో తీసుకోవాలని ఎన్నికల కమిషన్ భావిస్తోందన్నారు. వచ్చేది ఉత్తరాయనం పండుగలు సీజన్ కాబట్టి భక్తులకు ఇబ్బందులు లేకుండా ఎన్నికల విధుల నుంచి ఎండోమెంట్ ఉద్యోగులకు వెసులుబాటు కల్పించాలని పురందేశ్వరి కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement