Tuesday, November 26, 2024

చంద్ర‌బాబు అరెస్ట్ ను త‌ప్పుప‌ట్టిన బిజెపి…

న్యూఢిల్లీ – టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్ట్‌పై బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ స్పందించారు. సోమవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అరెస్ట్ సరికాదన్నారు. ఎలాంటి వివరణ అడగకుండా టీడీపీ అధినేతను అరెస్ట్ చేశారన్నారు. ఎఫ్ఐఆర్‌లో పేరు చేర్చకుండానే అరెస్ట్ చేయడం సరికాదన్నారు. ఆయనను అరెస్ట్ చేసిన తీరును బీజేపీ తప్పుబడుతోందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement