నెల్లూరు, ప్రభ న్యూస్ : దేశంలోని తమ వినియోగదారులకు మరింత ఉత్తమ సేవలందించేందుకు నెల్లూరులోని కృష్ణపట్నం పోర్టు వద్ద ఉన్న వంటనూనెల శుద్ధి కేంద్రాన్ని ప్రముఖ ఎడిబల్ ఆయిల్ కంపెనీ కార్గిల్ సొంతం చేసుకుంది. ఆ సంస్థ ఇండియా ఎండీ పీయూష్ పట్నాయక్ వెల్లడిస్తూ కొద్ది సంవత్సరాలుగా భారతదేశంలో వంట నూనెల వ్యాపారంలో గణనీయమైన వృద్ధిని మేము నమోదుచేస్తున్నామన్నారు. తాజాగా తాము పెట్టిన 35 మిలియన్ డాలర్ల భారీ పెట్టుబడి తమ కంపెనీ విస్తరణను వేగవంతం చేయనుందన్నారు. ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో తమ కంపెనీ మరింత విస్తరించడంతో పాటు భారతదేశంలోని తమ వినియోగదారుల పట్ల తమ కంపెనీ నిబద్ధతను సూచిస్తుందన్నారు.
నూత నంగా తాము సొంతం చేసుకున్న రిఫైనరీతో కలిపి ప్రస్తుతం తమ కంపె నీకి రిఫైండ్ పామ్ ఆ యిల్ , పామోలిన్ , వనస్పతి ( హైడ్రోజెనె-టె-డ్ వెజి టేబుల్ ఆయిల్), సన్ ప్లవర్ ఆయిల్ ను రిఫైండ్ చేసే సామర్ధ్యానికి పెరిగిందన్నారు. దేశంలో సన్ ప్లవర్ ఆయిల్ వినియోగంలో మూడింట రెండొం తుల సన్ ప్లవర్ ఆయిల్ రిఫైండ్ చేసే సామర్థం తమ కంపెనీకి ఉందన్నారు. అయినా అవసరాలకు అవి సరిపోవడం లేదని , తాజాగా తాము సొంతం చేసు కున్న ఈ రిపైనరీతో కార్గిల్ సంస్థ ద్వారా సొంత ఆయిల్ బ్రాండ్‌ను రి-టైలర్ల కోసం ఉత్పత్తి చేసి ప్యా కేజ్ చేయడంతో పాటు-గా బేకరీ , ఫుడ్ సర్వీస్ విని యో గదారుల అవసరాలను సైతం తీర్చే సామర్ధ్యా నికి చేరుకున్నామన్నారు. ఈ రిఫైనరీ ద్వారా కార్గిల్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ , తెలంగాణా , కర్నాటక , తమిళ నాడు వ్యాప్తంగా విస్తరించ నుంద న్నారు. వ్యాపారణ ఆధునీకరణ, విస్తరణకు పెట్టు-బడులు పెట్టడానికి కృషిచేస్తామని పట్నాయక్ అన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..