శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చారు.అప్పటికే గేట్లకు తాళాలేసేశామని, క్యూలైన్ లో వెళ్లాలని సెక్యూరిటీ సిబ్బంది సూచించడంతో మంత్రి, ఆయన వెంట వచ్చిన అనుచరులు అవాక్కయ్యారు. దీంతో కొంతసేపు ఆయన అక్కడే నిలిచిపోయారు.విషయం తెలుసుకున్న ఆలయ ఈవో భ్రమరాంబ హుటాహుటినా డిప్యూటీ సీఎం చెంతకు చేరుకుని జరిగిన పొరపాటుకు మన్నించామని కోరారు. అనంతరం ఈవో డిప్యూటీ సీఎంను ఆలయ మర్యాదాల ప్రకారం ఆలయంలోకి తీసుకెళ్లి దగ్గరుండి పూజలు చేయించి తీర్థ ప్రసాదాలు అందజేయించారు.ఉత్సవాల సందర్భంగా విధుల్లోకి వెళ్తున్న అర్చకులపై పోలీసుల వ్యవహరించిన తీరుపట్ల అసహనం వ్యక్తం చేశారు. ఆలయంలోకి వెళ్తున్న ఆలయ స్థానాచార్య, ప్రధానార్చకులను పోలీసులు అడ్డుకున్నారు. డ్యూటీ పాస్ చూపించినా అనుమతివ్వకపోవడంతో పోలీసులతో అర్చకులు వాగ్వాదానికి దిగారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement