Tuesday, November 26, 2024

మేకపోతుకు జన్మదిన వేడుకలు

కళ్యాణదుర్గం, మార్చి 15( ప్రభన్యూస్) మనిషిలో మానవత్వం మృగ్యమైంది. తల్లి బిడ్డలు,భార్యాభర్తలు,అన్నదమ్ములు స్వార్థ ప్రయోజనాల కోసం ఒకరినొకరు చంపుకుంటున్నారు. అయితే మానవత్వం పరిమళించే సంఘటనలు కూడా సమాజం లో అక్కడక్కడ జరగడం హర్షణీయం. ఇందుకు ఉదాహరణ . …. ఈ కథనం. .


అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం బోయలపల్లి లో తాము పెంచుకున్న మేకపోతుకు పుట్టినరోజు వేడుకలు చేసి ఔరా అనిపించారు ఓ యజమాని. తనకు పుట్టిన పిల్లలతోపాటు అంతే అభిమానంతో ప్రేమతో పెంచుకున్న మేకపోతుకు మొదటి సంవత్సరం పుట్టినరోజును ఘనంగా జరిపారు. మూడు కిలోల కేకు తెచ్చి ఇరుగుపొరుగు వారిని పిలిపించి వైభవంగా జరిపించారు. బోయలపల్లి కి చెందిన వెంకటేశులు, పద్మావతి లు పెంచుకుంటున్న మేక సరిగ్గా ఏడాది కిందట పిల్లకు జన్మనిచ్చింది. ఆ పిల్ల మేకపోతుగా పెరిగింది. చూడ ముచ్చటగా ఉన్న మేకపోతుకు తన ఇంట్లో శుభకార్యం చేయాలని తలచిన ఆ యజమానులుద్దరూ పుట్టినరోజు వేడుకలు చేసి ఔరా అనిపించారు. గ్రామస్తులు కూడా వెంకటేష్ దంపతులను అభినందించి మూగజీవుల పట్ల తన ప్రేమను చాటుకున్నాడని ప్రశంసించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement