Friday, November 22, 2024

Big Story: ఇదో అద్భుతం.. రాజమండ్రి బ్రిడ్జికి 47 ఏళ్లు..

ఈస్ట్, వెస్ట్ గోదావరి జిల్లాలను కలుపే రాజమండ్రి రోడ్ కమ్ రైల్ బ్రిడ్జికి సరిగ్గా ఈ రోజుతో 47 ఏళ్లు నిండాయి. ఈ బ్రిడ్జిపై ప్రయాణం చేస్తూ గోదావరి అందాలను చూస్తుంటే ఆ అనుభూతి చెప్పనలవి కాదు. ఈ ఫీలింగ్స్  ప్రతి ఒక్కరిలో ఎంతో అపురూపంగా పదిలంగా ఉంటాయి.  సరిగ్గా 47సంవత్సరాల క్రితం.. ఇదే రోజు ఈ బ్రిడ్జిని (23-. 11. 1974 ఉదయం 11 గంటలకు) అప్పటి రాష్ట్రపతి ఫ్రక్రుద్దీన్ అలీ అహ్మద్ జాతికి అంకితం చేశారు.

తిరుమల ఘాట్ రోడ్డు, శ్రీశైలం డ్యామ్ వంటి ఎన్నో అద్భుతాల మాదిరగానే ఈ బ్రిడ్జి కూడా ఒక ఇంజినీరింగ్ అద్భుతమే. ముఖ్యంగా రాజమండ్రి దగ్గర ఈ మలుపు చాలా లెక్కలు వేసి నిర్మించినట్టు ఇంజినీరింగ్ నిపుణులు చెబుతారు. ఇండియాలో అతి పొడవైన రైల్ కమ్ రోడ్ బ్రిడ్జిలలో ఇది మూడవది. మొదటిది అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిపై ఉండగా.., రెండో అదిపెద్ద బ్రిడ్జి సొన్ పూర్ బీహార్ లో ఉంది. ఇక.. మూడోది తూర్పు, పశ్చిమ గోదావరి జిలాలను కలుపుతూ రాజమండ్రి, – కొవ్వూరు మధ్య నిర్మించారు.

1964లో మూడో పంచవర్ష ప్రణాళికలో కొవ్వూరు, – రాజమండ్రి మధ్య రెండు వరుసల రైల్ మార్గాన్ని నదిపై బ్రిడ్జిని నిర్మించాలని తీర్మానించారు. అప్పటికి ఉభయ గోదావరి జిల్లాల మధ్య లాంచీ పైనే రాక పోకలు జరిగేవి. రాజమండ్రి నుండి భద్రాచలం దాకా సరుకు రవాణాకు కూడా లాంచీలే ఆధారంగా ఉండేవ. రోడ్ మార్గాన్ని కూడా కలిపి వంతెన నిర్మించాలన్న రాష్ట్ర ప్రభుత్వ వినతిని కేంద్రం ఆమోదించింది. ఆ తర్వాత సర్వే పర్మిషన్స్ రావడం, జెసోప్ కంపెనీ నిర్మాణం మొదలు పెట్టి 1974 ఆగస్టు నాటికి పూర్తి చేసింది.

రైల్ మార్గం 2. 8 కిలో మీటర్లు.. రోడ్ మార్గం 4. 1 కిలో మీటర్లు..
అప్పటి రాష్ట్రపతి ప్రక్రుద్దీన్ ఆలీ అహ్మద్ ఈ బ్రిడ్జిని ప్రారంభించారు. అప్పట్లో టీవీలు, బ్రేకింగ్ న్యూస్ లు లేవు. ఈ బ్రిడ్జి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రత్యక్ష ప్రసారం చేసింది. రేడియోలో ప్రతీ క్షణాన్నీ చక్కగా వర్ణిస్తూ అందరికీ కళ్లకు కట్టినట్టు వినిపించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/Vinayak2130/status/1463027966804303874
Advertisement

తాజా వార్తలు

Advertisement