ప్రభ న్యూస్, గుంటూరు రూరల్ ప్రతినిధి: గుంటూరులో డ్రగ్స్ కల్చర్ పెరుగుతుందా.. యువత ఈజీ మనీ కోసం వెంపర్లాడుతున్నారా.. గంజాయి గ్యాంగులు, డ్రగ్స్ మాఫియా వల్ల కళాశాలలు, కాలేజీలు బలవుతున్నాయా.. అంటే అవుననే చెబుతున్నారు నిపుణులు. పోలీసులకు చిక్కకుండా గంజాయి సరఫరా చేస్తున్న కేటుగాళ్లు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ఎంతో మంది యువతను గంజాయికి బానిసలను చేస్తున్నారు. రెండు చుక్కల లిక్విడ్ గంజాయితో పది రెట్లు ఎక్కువగా కిక్ వస్తుందని యువత లిక్విడ్ గంజాయి కోసం వెంపర్లాడుతుంటారు. లిక్విడ్ గంజాయి రవాణా చేసేందుకు తేలికగా ఉండడంతో మాఫియా ఈ పద్ధతిని ఎంచుకుంది. లిక్విడ్ ఎలా తయారు చేస్తారు.. రవాణా వంటి విషయాలపై ఈ స్టోరీ చదవండి..
గంజాయి వ్యాపారం కొత్త పుంతలు తొక్కుతోంది. ఏజెన్సీని కేంద్రంగా చేసుకుని పండించడం, రవాణా చేయడంలో మాఫియా తన కార్యకలాపాలను యథేచ్చగా సాగిస్తోంది. మామూలుగా గంజాయితో పోలిస్తే ద్రవరూపంలో ఉన్న గంజాయిని అక్రమ రవాణా చేయడం సులభతరం కావడం అలాగే లాభాలు కూడా 20 రెట్లు అధికంగా ఉండటంతో డ్రగ్స్ మాఫియా లిక్విడ్ గంజాయి తరలింపు పైన ప్రత్యేక దృష్టి సారించింది. లిక్విడ్ గంజాయి హాషిష్ ఆయిల్‌గా చలామణి అవుతోంది.
దశాబ్దాలుగా ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో గంజాయి సాగు సరఫరా జరుగుతుందని, ఏడాది కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల 90 వేల కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ఎన్‌ఐఏ సహకారంతో గంజాయిపై ఉక్కుపాదం వెూపుతామని ఇటీవల డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రకటించారు. డ్రై గంజాయి తాగాలంటే గంజాయిని పొడిగా చేసుకొని దాన్ని సిగరెట్ లోని పొగాకు పౌడర్ని మిక్స చేసుకొని ప్రత్యేకంగా తయారు చేసిన షీట్లలో సిగరెట్ గా తయారుచేసుకొని నిర్మానుష్య ప్రదేశాలు వెతుక్కొని వెళ్లి తాగాలి.
అదే లిక్విడ్ గంజాయి అయితే సిగరెట్ లలో ఒకటి లేదా రెండు చుక్కలు కలుపుకుని బహిరంగంగానే ఎవరికి అనుమానం రాకుండా తాగుతున్నారు. గంజాయిని బహిరంగంగా జేబులో పెట్టుకొని వెళ్లడం ప్రమాదకరం కావడంతో ద్రవరూపంలో ఉన్న గంజాయిని వాటర్ బాటిల్ లో, తేనె, దగ్గు మందు సీసాలో పెట్టుకొని ఈజీగా రవాణా చేస్తున్నారు. గుంటూరు నగరంలో ప్రధానంగా గంజాయి పెదాకాకని, గోరంట్ల ఇన్నర్ రింగ్ రోడ్డు దగ్గర నుంచి నగరంలోకి వస్తుంది. నగర శివారు ప్రాంతాల్లో అమ్మకాలు జరుగుతున్నాయి. గతంలో తక్కువుగా ఉండే రేట్లు ప్రస్తుతం రెండు రెట్లు సుమారు 1000 రూపాయల వరకు పెరిగింది. గుంటూరు రురల్ జిల్లా పరిధిలోని పొన్నూరు, బాపట్ల, అప్పికట్ల, చేబ్రోలు, చిలకలూరిపేట, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, గురజాల ప్రాంతాల్లో కూడా ప్రతిరోజు అమ్మకాలు జరుగుతున్నాయి
తయారీ విధానం..
గంజాయిని ఎండబెట్టి వాటిని ప్రాసెసింగ్ చేసి మిషనరీ ద్వారా, కొన్ని కెమికల్స్ ను జోడించి లిక్విడ్ గంజాయి తయారు చేస్తున్నారు. 20 నుంచి 30 కిలోల డ్రై గంజాయి నుంచి ఒక లీటర్ లిక్విడ్ తయారు చేస్తున్నారు. లిక్విడ్ గంజాయి తయారీలో వాడే టెట్రాహైడ్రోకెన్నబినార్దు వలన తీవ్ర దుష్ఫలితాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గంజాయిని ద్రవ రూపంలోకి మార్చే క్రమంలో ఆరోగ్యానికి హానికరమైన రకరకాల కెమికల్స్ ను వినియోగిస్తున్నారు.
అత్యంత ప్రమాదకరం
సాధారణ గంజారు కన్నా లిక్విడ్ గంజాయిఅత్యంత ప్రమాదకరం అని నిపుణులు తెలుపుతున్నారు. మామూలు గంజాయి లో ఉండే టి ఏV్‌ా సీ శాతం లిక్విడ్ గంజాయిలో 90 శాతం అధికంగా ఉండటం వలన హార్ట్ బీట్ పెరిగి అధికంగా ఒత్తిడికి లోనవుతున్నారు. కొన్ని సందర్భాల్లో మరణానికి కూడా దారి తీస్తుంది.
దుష్ప్రభావాలు
గణాంకాలను బట్టి గంజారుకి బానిసలు అవుతున్న వాళ్ళు 15 నుంచి 20 సంవత్సరాలలోపు వారే అధికం. చిరాకు, కోపం, విసుగు, అసహనం, ఆందోళన వంటి సమస్యలను గంజాయి సేవించేవారు ఎదుర్కొంటున్నారు. వీటితో పాటు మానసిక సమస్యలకు కూడా గురవుతున్నారు. ఆందోళన టెన్షన్, ఊపిరి ఆడనట్లు లోనవడం వంటివి జరుగుతుంటాయి. మరి కొందరు సైకోసిస్ సమస్యలతో బాధపడుతున్నారు. అంటే ఎవరో పిలుస్తున్నట్లు,హాని చేస్తున్నట్లు, కుట్ర పన్నుతున్నట్లు, చంపుతున్నట్లు ఊహించుకుంటూ ఉంటారు. ఒంటరిగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ కోల్పోతారు.
చికిత్స తప్పనిసరి
సిగరెట్,మందు తాగకుండా ఎలాగైతే మందులు ఉన్నాయో గంజాయి సమస్య నుంచి కొన్ని మందుల వలన బయటపడవచ్చని కొన్ని సర్వేలు తెలుపుతున్నాయి. కొన్ని సమయాల్లో హాస్పిటల్లో అడ్మిట్ అయి చికిత్స తీసుకోవాల్సిన అవసరం వుంది. అనుభవజ్ఞులైన డాక్టర్ల సలహాలు తీసుకొని ఈ సమస్య నుంచి బయట పడవచ్చని వైద్యులు తెలుపుతున్నారు.
ఇది కూడా చదవండి: AP: టేస్ట్ లో అదుర్స్.. అందుకే మన చేపలకు ఫుల్ డిమాండ్