Thursday, November 21, 2024

Big Story: వైద్యం చేయల్నా.. ఊళ్లు తిరగాల్నా? సర్వేలపేరుతో సతాయిస్తున్నరంటున్న ఏఎన్‌ఎంలు

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో పనిచేయాలని ఆయా ప్రాంతాలకు చెందిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు చెబుతున్నారు. అయితే మరోవైపు సర్వేల పేరుతో ఎంపీడీఓలు ప్రజలకు వైద్యసేవలు అందించే అవకాశం ఇవ్వకుండా ఏఎన్‌ఎంలను గ్రామాల్లో తిప్పుకుంటున్నారు. అదేమని ప్రశ్నిస్తే వారికి జీతాలిచ్చేది తామే కాబట్టి తాము చెప్పినట్లే పనిచేయాలని పట్టుబడుతున్నారు. మరోవైపు సచివాలయ కార్యదర్శులు.. ఏఎన్‌ఎంలను సచివాలయంలోనే నిత్యం అందుబాటులో ఉండాలని హుకుం జారీ చేస్తున్నారు. దీంతో ఎవరి మాట వినాలో.. ఏ పనిచేయాలో తెలియక రాష్ట్రవ్యాప్తంగా వివిధ సచివాలయాల్లో పనిచేసే ఏఎన్‌ఎంలు సతమైతున్నరు.

ఒక్కమాటలో చెప్పాలంటే.. మూడు శాఖల వింత వైఖరికి ఏఎన్‌ఎంలకు కొత్త తలనొప్పులు వచ్చి పడితున్నా యి. రాష్ట్రవ్యాప్తంగా 11,116 గ్రామ సచివాలయాలు, 3,913 వార్డు సచివాలయాల్లో ఏఎన్‌ఎంలు విధులు నిర్వహిస్తున్నా రు. సుమారు 15 వేల మందికి పైగా ఏఎన్‌ఎంలు సచివాలయాల పరిధిలో వైద్యసేవలు అందించ డానికి ప్రభుత్వం వారిని నియమించింది. అన్నిశా ఖలకు సంబంధించిన సేవలను అందుబాటులో ఉంచే ప్రక్రియలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి ఏఎన్‌ఎంలను కూడా నియమించింది. నిబంధనల మేరకు వీరు ఆయా సచివాలయాల పరిధిలోని ప్రజలకు నిత్యం వైద్యసేవలు అందించాలి.

ఆ దిశగా ఆయా ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యుల సూచన మేరకు పనిచేయాల్సి ఉంది. అయితే ఏ ప్రాంతంలో సేవలందిస్తున్నారో అందుకు సంబంధించిన సమాచా రాన్ని సచివాలయంలో ముందే తెలియపర చాలి. అయితే అందుకు పూర్తి భిన్నంగా కొంత మంది ఎంపీడీఓలు ప్రభు త్వం సూచించే వివిధ సర్వేల కోసం ఏఎన్‌ ఎంలను పురమాయిస్తుంది. అయితే ఆయా సచివాలయా ల పరిధిలో వైద్యసేవలు కూడా కుంటుపడుతున్నాయి. సకాలంలో టీకాలు కూడా వేయలేని పరిస్థి తులు ఎదురవుతున్నాయి. ఏఎన్‌ఎంలు కూడా అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.
నలిగిపోతున్న ఏఎన్‌ఎంలు
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా సచివాలయ వ్యవస్థ ను అందుబాటులోకి తెచ్చారు. ఈ వ ్యవస్థ ద్వారా రాష్ట్ర ప్రజలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అందుకోసం అన్నిశాఖలకు సంబంధించిన విభాగాలను సచివాలయంలో ఏర్పాటుచేసింది. సీఎం జగన్‌ కూడా ఈ వ్యవస్థ ను పూర్తి స్థాయిలో బలోపేతం చేశారు. ప్రజలకు మరింత నమ్మకం కలిగేలా సేవలం దించే దిశగా ఆయన నిత్యం ఈ వ్యవస్థ పై ప్రత్యేక దృష్టి కూడా సారిస్తున్నారు. అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం, ఏఎన్‌ఎంల సేవలను ఉపయోగించుకోవడంలో అనేక సంద ర్భాల్లో కొంతమంది అధికారులు విఫలమవుతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా ఏఎన్‌ఎంల విష యంలో ఎంపీడీఓలు ఇష్టానుసారంగా వ్యవహరి స్తున్నారు. ప్రభుత్వం సూచించే వివిధ సర్వేలను ఏఎన్‌ఎంల చేతే చేయిస్తూ వారి విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారు. దీంతో వారు వైద్యసేవలు పూర్తి స్థాయిలో అందించలేకపోతున్నారు. పింఛన్‌, వికలాంగులు, వైట్‌ కార్డులు తదితర సర్వేలను ఏఎన్‌ఎంలకే పురమాయిస్తున్నారు. తాజాగా సీనియర్‌ సిటిజన్స్‌పై సర్వే బాధ్యతలను కూడా వారికే అప్పగించారు. ఇదే సమయంలో వైద్య ఆరోగ్య శాఖ చార్ట్‌ సూచించిన విధంగా ఇంటింటా వైద్యసేవల కార్యక్రమాన్ని సకాలంలో పూర్తి చేయాలని వైద్యులు మరోవైపు పట్టుబడు తున్నారు. దీంతో వైద్యమా.. సర్వేలా ఎటూ తేల్చుకోలేక వారు నలిగిపోతున్నారు.

సకాలంలో టీకాలు.. వేయకపోతే.. మెమోలు
జాతీయ వ్యాధినిరోధక టీకాల కార్యక్రమంలో భాగంగా ప్రతి బుధ, శనివారాల్లో ఆయా ప్రాంతాల్లో ఏఎన్‌ఎంలు ఇంటింటికీ వెళ్లి చిన్నపిల్లలను గుర్తించి టీకాలు వేయాలి. ఈ ప్రక్రియ నిరం తరం కొనసాగుతూనే ఉంటుంది. ఏఎన్‌ఎంలకు ఎన్ని పనులు న్నా సరే వారంలో రెండురోజులు ఖచ్చితంగా టీకాలు వేసి తీరాలి. ఇదే సందర్భంలో ప్రతిరోజూ సగటున సచివాలయాల పరిధిలో నలుగురి నుంచి 8 మంది చిన్నపిల్లలు పుడుతూనే ఉంటారు. అటువంటి వారిని గుర్తించి టీకా మందు ఇవ్వాలి.

- Advertisement -

అదేరోజు సాయంత్రానికి అందుకు సంబంధించిన నివేదికలను కూడా పీహెచ్‌సీకి అందించాలి. అలాగే క్రమం తప్పకుండా గ్రామాల పరిధిలో ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవసరమైన వైద్యసేవలు అందించాలి. అందుకు సంబంధించిన సమాచా రం వైద్యులకు అందించాలి. ఇలా నిత్యం ఏఎన్‌ఎంలకు చేతినిండా పని ఉంటుం ది. అయితే ఇదే సందర్భంలో ఎంపీడీఓలు మీటింగ్‌ల పేరుతో కార్యాలయాలకు రావాలని ఆదేశాలు ఇస్తున్నారు. దీంతో ఇటు టీకాలు వేయలేక, అటు జీతాలిచ్చే ఎంపీడీఓల సమీక్షలకు హాజరుకాలేక నరకయాతన అనుభవిస్తున్నారు. ఎంపీడీఓల ఒత్తిడితో టీకా ప్రక్రియలో జాప్యం జరిగితే వైద్యులు చార్జ్‌ మెమోలు ఇస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement