అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో పడుతూ.. లేస్తున్న పర్యాటక రంగాన్ని గాడిన పెట్టేందుకు ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టిసా రించారు. ఇప్పటికే పలు ప్రాజెక్టులు చేపట్టగా పురోగతిలో ఉన్నాయి. ఇదే క్రమంలో పర్యాటక రంగంలో ఏపీని ముఖచిత్రంగా మార్చేందుకు ఆ శాఖ ఉన్నతాధికారులు అవకాశం ఉన్న మార్గాల సద్వినియోగంపై ఆలోచనలు చేస్తున్నారు. కోవిడ్-19 తదనంతర పరిణామాల నేపధ్యంలో నెలకొంటున్న సాధారణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కొత్త ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నారు. ఇందులో భాగంగా భారతీయ రైల్వేకు చెందిన ఐఆర్‌సీటీసీ (ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్)తో ఒప్పందం చేసుకునే ఆలోచనలో రాష్ట్ర పర్యాటక శాఖ ఉన్నతాధికారులు ఉన్నట్లు తెలిసింది. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి ఉన్న విస్తారమైన అవకాశాలను దృష్టి లో ఉంచుకొని రైల్వే అధికారులతో సంప్రదింపులు జరపనున్నారు. ‘రోడ్డు కమ్ రైలు’ పేరిట రైల్వేతో ఒప్పందం చేసుకోవడం ద్వారా దేశీయ పర్యాటకులను రాష్ట్రానికి రప్పిస్తే ఆర్థికంగా పర్యాటక రంగం పుంజుకుంటోందని అధికారుల భావన.
గత రెండేళ్లలో కోవిడ్-19 మహమ్మారితో రాష్ట్ర పర్యాటక రంగం అభివృద్ధి కుధేలైంది. పర్యా టక ప్రాంతాలకు సందర్శకులను అనుమతించలేదు. ఈ క్రమంలో పర్యాటక ప్రాంతాల్లోని సందర్శకుల కోసం కలిపించిన మౌలిక సదు పాయాలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. రోజువారీ సందర్శకులు లేకపోవడం..వివిధ కట్టడాలు, ఇతర సౌకర్యాలు దెబ్బతినడంతో ఏపీ పర్యాటక రంగం పెద్ద ఎత్తున నష్టాలను చవి చూసింది. రాష్ట్ర ప్రభు త్వం పర్యాటక రంగం అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని కొత్త పాలసీకి రూపకల్పన చేసినప్పటికీ..ప్రకృతి విపత్తుల నేపధ్యంలో ముందుకు సాగలేదు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు గాడిన పడుతున్న తరుణం లో నష్టాల నుంచి గట్టెక్కేందుకు పర్యాటకాభివృద్ధి సంస్థ అన్ని విధాల చర్యలు తీసుకుంటోంది. ఐఆర్‌సీటీసీ తో ఒప్పందం చేసుకోవాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చినట్లు చెపుతున్నారు.
ప్రకృతి సోయగాలు..
రాష్ట్రంలో ప్రకృతి శోయగాలకు కొదువ లేదు. రాష్ట్రంలో 972 కిలో మీటర్ల మేర సముద్ర తీరం విస్తరించి ఉంది. మరో వైపు కృష్ణా, గోదావరి నదులతో పాటు పలు చెరువులు, సరస్సులు ఉన్నాయి. మారుతున్న పర్యాటకుల అభిరుచులకు అనుగుణంగా బోటింగ్, సాహాస క్రీడల నిర్వహణ, బీచ్‌ల అభివృద్ధికి పర్యాటక శాఖ పలు ప్రాజెక్టులు చేపడుతోంది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో పర్యాటకులకు అవసరమైన వసతి, సౌకర్యాల ఏర్పాటుకు పలు పేరొందిన సంస్థలు ముందుకొస్తున్నాయి. రాష్ట్రంలో బోటింగ్‌కు కూడా మంచి ఆదరణ ఉంది. 2019 సెప్టెంబర్‌లో పాపికొండలు వెళుతున్న రాయల్ వశిష్ట బోటు ప్రమాదం తర్వాత ప్రభుత్వపరంగా కట్టుదిట్టమైన నిబంధన లు రూపొందించి ఇటీవలనే బోటింగ్ కార్యకలాపాలకు శ్రీకారం చుట్టింది. ఓ వైపు సముద్రతీర అందాలు, మరోవైపు నదీ విహారం వంటివి ఏపీ టూరిజానికి ఆయువుపట్టుగా ఉన్నాయి. ఇక అరకు, లంబసింగి వంటి ఉత్తరాంధ్ర అందాలతో పాటు నల్లమల అడవులతో పాటు పర్యాటకులను ఆకర్షించే ఇతర ప్రాంతాలు కోకొల్లలు.
ఆధ్యాత్మిక నిలయాలు..
రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలు అనేకం ఉన్నాయి. ఇదే సమ యంలో చారిత్రక, సాంస్కృతిక వారసత్వ సంపదకు ఏపీ నెలవు. వీటన్నింటిని అనుసంధానం చేస్తూ టెంపుల్ టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకోనున్నారు. తిరుమల శ్రీ వేంకటేశ్వ రస్వామిని దర్శిం చుకునేందుకు దేశవ్యాప్తంగా పలువురు భక్తులు వస్తుంటారు. ఇదే సమయంలో పలు ప్రముఖ పుణ్యక్షేత్రాలకు కూడా వేర్వేరు రాష్ట్రా లకు చెందిన భక్తులు వస్తుంటారు. కేవలం ప్రాం తాలకు మాత్రమే సందర్శకులు వచ్చి వెళుతున్నారని భావిస్తు న్నారు.
ఐఆర్‌సీటీసీ నేతృత్వంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా పర్యాటక సందర్శనలు ఉన్నాయి. సర్క్యూట్ రై లు పేరిట వివిధ చారిత్రక, ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతా లను కలుపుతూ ఐఆర్‌సీటీసీ ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ఐఆర్ సీటీసీతో భాగస్వామ్యమైన పక్షంలో ఏపీకి సందర్శకులు పెరుగుతారు. ఏపీలోని టూరిజం ప్రాంతాలను కలు
పుతూ ప్రముఖ పట్టణాల నుంచి రైళ్లను నడిపిన పక్షంలో ఇక్కడ వారికి కావాల్సిన వసతి సౌకర్యా లు, సందర్శన ఏర్పాట్లు ఏపీ పర్యాటక శాఖ చూస్తుంది. తిరిగి వారిని నిర్థేశిత రైలు ఎక్కించే వరకు పర్యాటక శాఖ అధికారులు చూస్తారు. రైల్వే అధికారులు సైతం ఇందుకు సుముఖంగా ఉన్నట్లు తెలి సింది. అంతా అనుకున్నట్లు జరిగితే రెండు మూడు నెలల్లోపు రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయి.