అమరావతి – టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు భారీ ఉపశమనం కలిగింది. మధ్యంతర బెయిల్‌నేపథ్యంలో చంద్రబాబు మంగళవారం సాయంత్రం రాజమహేంద్రవరం జైలు నుంచి విడుదల కానున్నారు. అయితే తాజాగా సీఐడీ చంద్రబాబు హయాంలో మద్యం పాలసీలో అవకతవకలు జరిగాయని కేసు నమోదు చేసింది.ఈ కేసులో చంద్రబాబును ఏ3గా సీఐడీ పేర్కొంది.
ఈ కేసులో మంగళవారం చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాదులు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. మద్యం కేసులో చంద్రబాబు లంచ్‍మోషన్ పిటిషన్‍పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. మధ్యంతర బెయిల్ గడువు పూర్తయ్యే వరకు ఇతర ఏ కేసుల్లో చంద్రబాబుపై చర్యలు తీసుకోమని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం తెలిపారు. మద్యం కేసులో 15న కౌంటర్ దాఖలు చేస్తామన్న ఏజీ వెల్లడించారు. దీంతో తదుపరి విచారణను నవంబర్ 21కి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది