Sunday, October 6, 2024

AP | వరద బాధితులకు బిగ్ రిలీఫ్… అంద‌రికీ సాయం అందుతుంది !

ఏపీలో వరద బాధితుల‌కు బిగ్ రిలీఫ్ ఇచ్చింది ప్ర‌భుత్వం. ఇప్పటికే వరద నష్టపరిహారం అందించిన ప్రభుత్వం.. ఇంకా పరిహారం అందని వారికి కూడా పరిహారం పంపిణీ చేయాలని నిర్ణయించింది. వరద బాధితుల్లో ఇప్పటివరకూ 98 శాతం మందికి పరిహారం జమ చేసినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది.

వరదల కారణంగా నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని అధికారులు తెలిపారు. బాధితులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అందరికీ సాయం అందుతుందన్నారు.

కాగా, మొత్తం రూ. 602 కోట్లు విడుదల చేయ‌గా.., ఇప్పటి వరకు 98 శాతం మందికి పరిహారం జమ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. సాంకేతిక కారణాలతో వరద సాయం అందని 2 శాతం మందికి రేపు (సోమవారం) నగదు జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో 15 వేలు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 4వేల‌ కుటుంబాలకు ఇతర జిల్లాల్లోని బాధిత ప్రజల ఖాతాల్లో అధికారుల ద్వారా డబ్బు జమ చేయనున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement