Saturday, November 23, 2024

Big Breaking: నెల్లూరు కార్పొరేషన్‌ క్లీన్‌స్వీప్.. అన్ని వార్డ‌ల్లోనూ ఫ్యాన్ గాలి!

ఏపీలో జరిగిన మున్సిపల్, నగర పంచాయితీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగిస్తోంది. నెల్లూరు కార్పొరేషన్‌ను వైసీపీ కైవసం చేసుకున్న‌ట్టు తెలుస్తోంది.

నెల్లూరు కార్పొరేషన్ సహా ఏపీలోని 13 మున్సిపాల్టీలు, నగర పంచాయ‌తీలు, 10 మున్సిపాల్టీల్లో ఖాళీగా ఉన్న డివిజన్లు, వార్డులకు ఎన్నికలు జ‌రిగాయి. కాగా ఈరోజు (బుధ‌వారం) దానికి సంబంధించిన కౌంటింగ్ జ‌రుగుతోంది. ఆ ఫలితాలు ఒక్కొక్క‌టిగా వెలువడుతున్నాయి.

నెల్లూరు కార్పొరేషన్‌ను వైసీపీ కైవసం చేసుకునే దిశగా సాగుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్పటికే 20 డివిజన్లలోఆ పార్టీ విజయం సాధించగా, మరో 24 డివిజన్లలో ఆధిక్యంలో కొనసాగుతోతున్నట్టు సమాచారం. కాగా, ఇప్పటికే 8 డివిజన్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు ఏకగ్రీవం అయ్యారు.

అంతేకాకుండా ఏపీలోని కుప్పం, ఆకివీడు, బేతంచెర్ల, కమలాపురం, రాజంపేట, గురజాల, బుచ్చిరెడ్డిపాలెం, దాచేపల్లిలో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ భారీ విజయం సాధించింది. తాడిపత్రి మున్సిపాల్టీ మినహా మిగిలిన అన్ని కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో ఫ్యాను హవా సాగుతోంది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement