ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గనుల శాఖలో సమ్మెను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధించింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగులు విధులకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. విధులకు హాజరుకాని ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని గనుల శాఖ డైరెక్టర్ తెలిపారు. ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రుల కమిటీ భేటీ అయిన విషయం విదితమే. అయితే ఆ తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడంతో చర్చనీయాంశంగా మారింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..