టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన ‘నిజం గెలవాలి’ యాత్ర ప్రారంభమైంది. ఉదయం నారావారిపల్లెలోని ఎన్టీఆర్ విగ్రహానికి ఆమె నివాళులర్పించారు. అనంతరం చంద్రగిరికి చేరుకున్నారు. ప్రవీణ్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. ఆయన కుటుంబానికి ఆర్థిక సాయాన్ని అందించారు. టీడీపీ మీకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
చంద్రబాబు అరెస్ట్‌తో ఆవేదన చెంది మరణించిన తెదేపా కార్యకర్తలు, అభిమానుల ఇళ్లకు వెళ్లి బాధిత కుటుంబీకులను భువనేశ్వరి పరామర్శిస్తున్నారు. తొలిరోజు తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఎ.ప్రవీణ్‌రెడ్డి కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించి ఓదార్చారు. రూ.3లక్షల చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. ధైర్యంగా ఉండాలని.. కుటుంబానికి తామంతా అండగా ఉంటామని భువనేశ్వరి భరోసా ఇచ్చారు.
ప్రభుత్వం వచ్చిన అనంతరం కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం కల్పించనున్నట్లు హామీ ఇచ్చారు. అనంతరం పాకాల మండలం నేండ్రగుంటకు చేరుకుని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో, శ్రీ మూలస్థాన ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మృతిచెందిన కనుమూరి చిన్నబ్బ నాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించి, పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించి ఓదార్పు చెప్పారు.
భువనేశ్వరి వెంట మాజీ శాసన సభ స్పీకర్ ప్రతిభా భారతి, ఎమ్మెల్సీ పంచమూర్తి అనురాధ, టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, నారా కుటుంబీకులు, మాజీ మంత్రి ఎన్ అమర్నాథ్ రెడ్డి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, చల్లా బాబురెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని, మహిళా నేత పులివర్తి సుధా రెడ్డి, రాష్ట్ర మహిళా కార్యనిర్వహక కార్యదర్శి సింగు సుధా, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు లంకెల లలిత, అమ్ములు, సునిత, పెద్ద ఎత్తున మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.