పాణ్యం ( ప్రభ న్యూస్):మాజీ మంత్రి ఆళ్లగడ్డ టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి భూమా అఖిలప్రియ, సోదరుడు భూమా జగత్ విఖ్యాత రెడ్డి, భర్త భార్గవ రామాలను పాణ్యం పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. బుధవారం టిడిపి నాయకులు ఏవి సుబ్బారెడ్డి పై దాడి చేసిన కేసులో ఫిర్యాదు మేరకు తెల్లవారుజామున ఆళ్లగడ్డ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి అరెస్టు చేశారు. ఆళ్లగడ్డ పోలీస్ స్టేషన్లో నాయకుల, కార్యకర్తల, సందర్శన తాకిడి ఎక్కువ అవ్వడంతో శాంతిభద్రతల కు ఎటువంటి ఇబ్బందులు కలవకుండా ముందస్తు చర్యగా భూమా అఖిలప్రియ కుటుంబ సభ్యులను నంద్యాలకు తీసుకుని వచ్చి అక్కడనుండి పోలీసులు పాణ్యం పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి స్టేషన్ లో నిర్బంధించారు. దానికి సంబంధించిన విషయాలను కేసులను ఫైల్ చేయడానికి పోలీసులు పై అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement