అమరావతి, ఆంధ్రప్రభ : జూలై 4వతేదీన ప్రధాని నరేంద్ర మోడీ ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్ననేపధ్యంలో విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. భీమవరం పర్యటనలో భాగంగా ప్రధాని విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలను పురస్కరించుకుని 30 అడుగుల అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు.అనంతరం బహిరంగ సభలో ప్రధాని పాల్గోనున్నారని సిఎస్ పేర్కొన్నారు.
ప్రధాని పర్యటన విషయమై శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుండి సంబంధిత శాఖల అధికారులతో ఆయన వీడియో సమావేశం ద్వారా ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సీఎస్ సమీక్షించారు. ప్రధాని పర్యటనకు ఇంకా నెలరోజులు సమయం ఉందని ఇది ప్రాధమిక సమావేశమే కావున ఇప్పటి నుండే తగిన ప్రణాళిక రూపొందించి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రధాని భీమవరం చేరుకుని తదుపరి అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ,బహిరంగ సభ వరకూ పూర్తి స్థాయిలో కట్టు దిట్టమైన ఏర్పాట్లు చేయాల్సి ఉందని చెప్పారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.