Monday, November 18, 2024

‘భీమసింగి’ చెరకు రైతుల పాద‌యాత్ర‌..

జామి, (ప్రభ న్యూస్‌) : భీమసింగి షుగర్స్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు పాదయాత్ర చేపట్టాలని రైతులు భావించినప్పటికీ పోలీసులు అడుగడుగునా నిర్భంధాలు సృష్టించడంతో రైతులు జామి మండల కేంద్రంలోని దొండపర్తి జంక్షన్‌ నుంచే రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు తమ్మినేని సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి చల్లా జగన్‌ ఆధ్వర్యంలో పాదయాత్ర ప్రారంభించారు. అయితే అప్పటికే అక్కడకు చేరుకున్న పోలీసులు తొలుత పాదయాత్ర నిలుపుదల చేయాలని నాయకులతో వాగ్వివివాదానికి దిగారు. అయిన రైతులు పాదయత్ర ఆపేది లేదని ముందుకు సాగారు. ఈ సమయంలో గంటపాటు రైతులకు, పోలీసులకు మధ్య తోపులాట జరి గింది. ఈ సమయంలో పోలీసులు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు తమ్మినేని సూర్యనారాయణను బలవంతంగా లాక్కెళ్లి, జీపులో అక్రమంగా తరలించారు.

అయినప్పటికి చల్లా జగన్‌ నాయకత్వంలో మరికొంత దూరం పాదయాత్ర సాగింది. ఈ సారి జగన్‌ ను అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు తెగబడడంతో రైతులు తిరగబడ్డారు. పోలీసు వాహనాలకు అడ్డంగా బైఠాయించారు. చివరిగి పోలీసులు అధికారులనే రైతుల వద్దకు తీసుకొని వచ్చి సమాధానం చెప్పేందుకు ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. అధికారులు వచ్చినప్పటికీ అరెస్ట్‌ చేసిన నాయకులను విడుదల చేస్తేనే ఆగుతామని పట్టుబట్టారు .ఈ నేపధ్యంలో ఆర్డీవో భవానీ శంకర్‌ , డీఎస్పీ అనిల్‌ సంఘటన స్థలం వద్దకు చేరుకొని రైతులతో చర్చించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement