హైదరాబాద్ – మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నేటి ఉదయం కడపలో అరెస్ట్ చేసిన వైఎస్ భాస్కరరెడ్డికి సీబీఐ జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. ఆదివారం ఉదయం పులివెందులలో భాస్కరరెడ్డి నివాసంలో సీబీఐ అధికారులు ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అరెస్ట్ చేసిన అనంతరం భాస్కర్‌రెడ్డిని సీబీఐ అధికారులు హైదరాబాద్ తరలించారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఆయనను న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌ను విధించారు. దీంతో ఆయనను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement