కశింకోట, జనవరి7(ప్రభ న్యూస్): రాష్ట్ర డిప్యూటీ సీఎం బుడి ముత్యాల నాయుడును అనకాపల్లి వైసీపీ నియోజకవర్గ ఇంచార్జి మలసాల భరత్ కుమార్ ఆదివారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనకాపల్లి నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి భరత్ కుమార్ను నియమించిన విషయం తెలిసిందే. అయితే ఇంచార్జి బాధ్యతలు తీసుకున్న భరత్ కుమార్ డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడును కలవడం ఇదే మొదటి సారి. ముత్యాల నాయుడు ను భరత్ కలిసి సత్కరించి జ్ఞాపికాను అందచేశారు.
ఈ సందర్భంగా ముత్యాల నాయుడు మాట్లాడుతూ వ్యాపార రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో రాణించి, ఎమ్మెల్యేగా అయ్యి సమాజ సేవ కార్యక్రమాలు చేపట్టాలని భరత్ కు సూచించారు. రాజకీయాల్లో గెలుపుకు ఏవిధంగా ప్రజలలోకి వెళ్ళాలి, నాయకులు, కార్యకర్తల సమన్వయతో పనిచేసే విధంగా కృషి చేయాలన్నారు. కష్టపడి పని చేసే భారీ మెజారిటీతో గెలవాలని భరత్ కు సూచించారు.ముత్యాల నాయుడును కలిసిన వారిలో కుటుంబ సభ్యులు మాజీ ఎంపీపీ మలసాల ధనమ్మ, విశాఖ డెయిరీ డైరెక్టర్ మలసాల రమణరావు, వైసీపీ యువజన నాయకులు కుమార్ రాజా, పలక రవి తదితరులు పాల్గొన్నారు.