తమిళ హీరో విజయ్ అక్కడ కొత్తగా ప్రాంతీయపార్టీని ఏర్పాటు చేశారు.. తమిళగ వెట్రి కళగం పార్టీని స్థాపించారు. ఆదివారం ఈ పార్టీ తొలి మహానాడు జరిగింది. తన పొలిటికల్ ఎంట్రీని ఉద్దేశించి ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. అశేష అభిమానుల మధ్య తమ పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఇక మూవీలలో నటించకుండా తన రాజకీయ పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేస్తానని ప్రకటించారు..
కాగా విజయ్ పొలిటికల్ ఎంట్రీపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ స్పందించారు. అభినందనలు తెలుపుతూ తాజాగా ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ”ఎంతోమంది సాధువులు, సిద్ధులకు నెలవైన తమిళనాడులో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నటుడు విజయ్‌కు నా హృదయపూర్వక అభినందనలు” అని పేర్కొన్నారు.
- Advertisement -