Thursday, January 23, 2025

AP | కర్నూలు కలెక్టర్‌కు బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డు!

కర్నూలు బ్యూరో : కర్నూలు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషాకు 2024 సంవత్సరానికి బెస్ట్ ఎలెక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డ్ లభించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం నుంచి గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.

గత ఏడాది బాపట్ల జిల్లా కలెక్టర్ గా 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అత్యుత్తమ పనితీరు కనపరిచినందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ బెస్ట్ ఎలెక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డ్ కు రంజిత్ బాషాను ఎంపిక చేసింది.

ఓటర్ల జాబితా తయారీలో, సమ్మరీ రివిజన్లో విశేష కృషి చేసి ఓటర్ల జాబితా తయారీకి పలు సూచనలు, నూతన ఓటర్లను చేర్పించడం, అనర్హులను తొలగించడం తదితర అంశాలపై కలెక్టర్ కు ఈ ఉత్తమ అవార్డు లభించింది.

ఈ నెల 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం పురష్కరించుకొని విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుగనున్న కార్యక్రమంలో కలెక్టర్ పి.రంజిత్ బాషా ఈ అవార్డును స్వీకరిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement