విజయవాడసిటీ, ప్రభన్యూస్ : బెంజి సర్కిల్ రెండవ ప్లైఓవర్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను నిన్న రాష్ట్రా ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు పరిశీలించారు. డిసెంబర్ 10న కేంద్ర రవాణా శాఖమాత్యులు నిలిస్ గడ్కరీ, సీఎం వైఎస్.జగన్ ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లపై ఆయా అధికారులకు ప్రిన్సిపాల్ సెక్రెటరీ యం.టి.కృష్ణ బాబు సూచనలు చేశారు.
స్కూ బ్రిడ్జి జంక్షన్ నుంచి నోవాటల్ వరకు 2.47 కిలో మీటర్ల మేర బెంజ్ సర్కిల్ రెండవ ప్లైఓవర్ నిర్మాణం జరిగిందన్నారు. దీని మూలంగా ఎస్ హెచ్ 16లో ముఖ్యంగా నగరంలో ని బెంజ్ సర్కిల్, నిర్మల కాన్వెంట్, రమేష్ హాస్పిటల్ జంక్షన్ దగ్గర ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందన్నారు. నిర్ణీత సమయానికి ముందుగానే నిర్మాణం పూర్తి చేసుకున్న ప్లైఓవర్ రిటైనింగ్ గోడలకు ఇరువైపులా నాయిస్ బేరర్లు ఏర్పాటు చేశారని దీనివల్ల వాహనాల వల్ల వచ్చే శబ్దాన్ని తగ్గించగలమన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital