విజయనగరం, (ప్రభ న్యూస్) : గృహ నిర్మాణ లబ్ధిదారులందరినీ గుర్తించి, వారికి జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి సూచించారు. దీని కోసం సచివాలయ సిబ్బంది క్షేత్ర స్థాయిలో పర్యటించి, ప్రతీ ఇంటి వివరాలను పరిశీలించాలని ఆదేశించారు. విజయనగరం కార్పొరేషన్ పరిధిలోని 24 సచివాలయాలకు చెందిన వీఆర్‌వోలు, డీఈవోలు, తదితర సిబ్బందితో కలెక్టరేట్ ఆడిటోరియంలో సమావేశాన్ని నిర్వహించారు. ఓటీఎస్ అమలుపై సచివాలయాల వారీగా సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఒన్‌టైమ్ సెటిల్‌మెంట్ పథకం గురించి ప్రజల్లో విస్తృత అవగాహాన కల్పించి, పథకం అమలును వేగవంతం చేయాలని కోరారు. క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులు, సందేహాలు, సాంకేతిక సమస్యలను తమ ఉన్నతాధికారులు దృష్టికి తీసుకువెళ్లి వెంటనే పరిష్కరించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) మయూర్ అశోక్, ఆర్డీవో బీహెచ్ భవానీశంకర్ , మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ ప్రసాదరావు, మెప్మా పీడీ బి. సుధాకరరావు, తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital