Monday, November 18, 2024

బీ కేర్ ఫుల్.. జాదూగాళ్లున్నరు.. జాబ్ పేరిట మోసం చేస్తరు..

కర్నూలు, ప్రభన్యూస్‌: యువత తమ చదువులు ముగియగానే ఉద్యోగ అన్వేషణలో పడటం సహజం. వందలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల వేటలో ఉన్నారు. వారి ఆతృత, ఆశను ఆసరాగా చేసుకున్న మోసగాళ్లు నిండా ముంచేస్తున్నారు. ఇలా ప్రతిరోజు కర్నూలు జిల్లాలో ఏదో ఒక పోలీసుస్టేషన్‌ పరిధిలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గత మూడు నెలల కాలంలో ఈ విషయాన్ని పరిశీలిస్తే ఉద్యోగాల పేరుతో ఎంతో మంది మోసపోయినట్లు తెలిసింది. ఈ విషయంపై ఎప్పటికప్పుడు పోలీసుశాఖ హెచ్చరికలు చేస్తున్నా నిరుద్యోగులు మోసపోతూనే ఉన్నారు

చాల మంది యువతి, యువకులు తమ చదువులు పూర్తికాగానే ఉద్యోగ అన్వేషణలో ఎన్నో కలలు గంటున్నారు. అనతి కాలంలోనే ఉద్యోగం సంపాదించి లగ్జరీ జీవితంను అనుభవించాలని కొందరు. తమ తల్లిదండ్రులకు, కుటుంబ స భ్యులకు ఆసరగా నిలువాలని మరి కొందరు మోసగాళ్ల బారీన పడుతున్నారు. వాస్తవంగా ఏ ఉద్యోగమైన సరే తాము చదివిన చదువుల్లో ప్రతిభ, ఇంటర్వూ ఆధారంగా వస్తుందనే విషయంను మరిచిపోతున్నారు. డబ్బులు ఇస్తేరావు విషయంను గ్రహించడం లేదు. ఈ క్రమంలో ఉద్యోగాల అన్వేషణలో మోసపోతూనే ఉన్నారు. కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించే వారికి ఇంకా డబ్బులు ఇస్తూనే ఉన్నారు. కాని ఏ గవర్నమెంట్‌ ఉద్యోగం అయినా మధ్యవర్తుల ద్వార రాదనే విషయంను గ్రహించడం లేదు.

పోటీ పరీక్షలు, ఇంటర్వూలు, ప్రతిభల ఆధారంగానే ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని తెలిసినా కూడ ఎవరైనా వచ్చి డబ్బులు ఇస్తే ఉద్యోగాలు ఇస్తామంటే నమ్మిమోసపోతూనే ఉన్నారు. డబ్బులు ఇచ్చి మోసపోతుంటే ఎవరూ కూడ వాటిని అడ్డుకోలేరని, ఒకవేళ ఫిర్యాదు చేస్తే పోలీసులు కూడ కేసులు నమోదు చేసి వారిని జైలుకు పంపుతారేమో కాని డబ్బు తిరిగి ఇప్పించలేని పరిస్థితి వారిది. కావున యువతి, యువకులు ,నిరుద్యోగులు ఇలాంటి విషయాలను అలోచించి ముందుకు అడుగువేయాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి మోసగాళ్ల బారినపడితే అనేక ఏళ్లుగా కష్టపడి సంపాదిం చుకున్న పెద్దల సొమ్ము పరులపాలు కావడం ఖాయం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement