Friday, November 22, 2024

AP: భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి… మంత్రి ఎన్ఎండీ ఫ‌రూక్

నంద్యాల బ్యూరో, ఆగస్టు 31 (ప్రభ న్యూస్): రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్న సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర న్యాయశాఖ అండ్ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ సూచించారు. శనివారం విలేఖర్ల సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఇవాళ‌ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని, అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్ష సూచనలు వాతావరణ శాఖ తెలిపిన ప్రకారం వర్షం కురిసే అవకాశం ఉందన్నారు.

- Advertisement -

ప్రస్తుత తరుణంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు సూచనలు చేయాలన్నారు. అవసరమైన సహాయక చర్యలకు ప్రభుత్వ సిబ్బంది సిద్ధంగా ఉండాలని చెప్పారు. మ్యాన్ హోల్, కరెంట్ తీగలు తెగిపడే ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు. వాగులు, వంకల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా చూడాలని అధికారులకు తెలియజేశారు. కుందూనదీ నిండుగా ప్రవహిస్తుందని పైనుంచి వరద నీరు ఉద్ధృతంగా రావడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement