తిరుపతి సిటీ, (ప్రభ న్యూస్) : ఈ మధ్యకాలంలో వివిధ రకాల సైబర్ నేరాలు జరుగుతున్నాయని, నేరాలకు ఆస్కారం ఇవ్వకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలని తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ వెంకటప్ప నాయుడు అన్నారు. గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సైబర్ నేరాలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయని, కేవైసీ పేరిట మోసాలకు పాల్పడుతూ డబ్బులను కొట్టేస్తున్నారని తెలియజేశారు. క్యూఆర్ కోడ్, ఓటీపీ పేరుతో ఫోన్ చేసి వివరాలు అడిగితే చెప్పొద్దని.. ఎవరికీ బ్యాంకు వివరాలు ఇవ్వకూడదని ఆయన సూచించారు. గూగుల్ లో కూడా ఫేక్ మెసేజ్‌లు వస్తుంటాయని, సోషల్ మీడియాలో వచ్చే ప్రతి విషయాన్ని నమ్మకుండా నిర్ధారించుకున్న తర్వాతే ఏదైనా లావాదేవీలు నిర్వహించాలని ప్రజలను కోరారు. అలాగే చాటింగ్ పేరుతో కూడా వలవేసి మోసాలు చేస్తున్నారని, ఈ విషయంలో కూడా యువతీ యువకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
చాటింగ్ పేరిట బుట్టలోపడేస్తారు, ఫేక్ మెస్సేజ్లతో కొల్లగొడతారు.. జాగ్రత్తగా ఉండాలి
Advertisement
తాజా వార్తలు
Advertisement