Sunday, September 8, 2024

Basara IIIT నోటిఫికేషన్ విడుదల.. జూన్ 1 నుంచి అడ్మిషన్లు

బాసర రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (బాసర ట్రిపుల్ ఐటీ) అడ్మిష‌న్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ జూన్ 1 నుంచి ప్రారంభమై జూన్ 22న ముగుస్తుంది. విద్యార్థులు https://www.rgukt.ac.in/ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. లేదంటే మీసేవ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.

ఎంపికైన విద్యార్థుల జాబితాను జూలై 3న విడుదల చేస్తారు. ఆ తర్వాత జూలై 8 నుంచి 10వ తేదీ వరకు ఎంపికైన విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. ఈ మేరకు యూనివర్సిటీ యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. కోర్సులో జాయిన్ అయితే రెండేళ్ల ఇంటర్ సహా ఇంజినీరింగ్ పూర్తి చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం యూనివర్శిటీ వెబ్ సైట్‌ను చూడాలని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement