జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఏర్పాటైన సత్యసాయి జిల్లా కలెక్టర్ గా బసంత్ కుమార్ బాధ్యతల స్వీకరించారు. సంపూర్ణ అభివృద్ధే లక్ష్యంగా పాలనా వికేంద్రీకరణ చేస్తూ 13 కొత్త జిల్లాలను సీఎం జగన్ నేడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పుట్టపర్తిలోని కలెక్టరేట్లోని కార్యాలయంలో మంత్రి శంకర్ నారాయణ, ఎంపీ గోరంట్ల మాధవ, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ,సత్యసాయి ట్రస్ట్ ప్రతినిధి రత్నాకర్ జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్, ఎస్పి, రాహుల్ దేవ్ సింగ్ జాయింట్ కలెక్టర్, దినేష్ కుమార్, పెనుగొండ సబ్ కలెక్టర్ నవీన్, ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement