Thursday, November 7, 2024

Bapatla ల్యాబ్ లో ప్ర‌మాదం … 24 మంది విద్యార్ధులకు అస్వ‌స్థ‌త‌

బాపట్ల కేంద్రీయ విద్యాలయంలో ఘ‌ట‌న‌
ప్ర‌యోగాలు చేస్తున్న స‌మ‌యంలో వెలువ‌డిన వాయువులు
ఊపిరి ఆడ‌క ఉక్కిరి బిక్కిరి
హుటా హుటిన హాస్స‌ట‌ల్ కు త‌ర‌లింపు
స్పందించిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు

గుంటూరు: బాపట్ల కేంద్రీయ విద్యాలయంలో శనివారం ప్రమాదం చోటు చేసుకుంది. సైన్స్‌ ల్యాబ్‌లో అనుకోకుండా ప్రమాదకర వాయువులు విడుదలయ్యాయి. దీంతో ల్యాబ్‌లో ఉన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఊపిరి ఆడకపోవడంతో పలువురు ల్యాబ్‌ నుంచి బయటకు పరిగెత్తారు. మరికొంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురవడంతో ఉపాధ్యాయులు వారిని బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవడంతో ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

- Advertisement -

అధికారుల‌తో మాట్లాడిన చంద్ర‌బాబు
ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీసారు. సంబంధిత అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి….పిల్లల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ప్రాణాపాయం లేదని….వైద్య సాయం అందిస్తున్నామని అధికారులు తెలిపారు. అవ‌స‌ర‌మైతే మెరుగైన వ్యైద్యం కోసం విజ‌య‌వాడ‌కు,లేదా గుంటూరుకు పంపాల‌ని ఆదేశించారు ..

Advertisement

తాజా వార్తలు

Advertisement