Friday, November 22, 2024

Supreme Court : చంద్ర‌బాబుపై ఓటుకు నోటు కేసు..విచార‌ణ రెండు వారాలు వాయిదా

న్యూ ఢిల్లీ – తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టులో బుధవారం విచారణ జరిగింది. సుప్రీంకోర్టులో ఈ కేసుపై వాదనలు ప్రారంభం అవుతుండగా చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా గడువు కోరారు. రెండు వారాలపాటు కేసు విచారణను వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు.

దీంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తి కేసు విచారణను రెండు వారాలపాటు వాయిదా వేసింది. ఓటుకు నోటు కేసు విషయమై రెండు పిటిషన్లను మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేశారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పేరును చేర్చాలని ఒక పిటిషన్ దాఖలు చేయగా ఓటుకు నోటు కేసు విచారణను తెలంగాణ ఏసీబీ నుండి సీబీఐకి అప్పగించాలని కోరుతూ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన రెండు పిటిషన్లపై విచారణ సుప్రీంకోర్టులో లిస్టైంది. దీంతో బుధవారం విచారణ జరపగా చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాది విజ్ఞప్తితో మరోసారి వాయిదా పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement