Saturday, November 23, 2024

కామాంధ బ్యాంక్ మేనేజర్, లోను కోసం వచ్చిన మహిళలపై లైంగిక వేధింపులు

నెల్లూరు జిల్లాలో ఓ కామాంధుడి వ్యవహారం గుట్టురట్టయింది. పొదలకూరులోని ప్రముఖ బ్యాంకు మేనేజర్ నగేశ్ అసభ్యంగా ప్రవరిస్తూ మహిళలను వేధింపులకు గురిచేస్తున్నాడు. అంతేకాదు ఏకంగా బ్యాంకులోనే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వారిపై లైంగిక దాడులకు దిగుతున్నాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అవడంతో విషయం బయటకు వచ్చింది.

బ్యాంకుకు రుణాలు, ఇతర అవసరాల కోసం వచ్చే మహిళలను లోబర్చుకుంటూ.. ఏకంగా బ్యాంకులోనే రాసలీలలు సాగిస్తునాడు బ్యాంకు మేనేజర్ నగేశ్ ఆ కామాంధుడు.. లోన్ల కోసం వచ్చేవారిని తన ఛాంబర్‌లోకి పిలిచి సొల్లు కబుర్లు చెబుతుంటాడు.. ఇక, లోన్లు కట్టలేనివారు.. కొత్త లోన్లు కోసం వచ్చిన గృహిణులను టార్గెట్‌గా చేసుకుంటాడు.. వారి ఆర్థిక అవసరాలను ఆసరగా మార్చుకుని మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి.. కొందరు మహిళలపై బ్యాంకు ఆవరణలోనే వికృతచేష్టలకు పాల్పడిన ఘటనలు జరిగాయి. ఒంటరిగా ఉన్న మహిళలు అతడి క్యాబిన్‌లోకి వెళ్లేందుకే వణికిపోతున్నారంటే.. అతగాడి చేష్టలు ఏ రేంజ్‌లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.. ఇలాంటి కీచకుడు బ్యాంకులో ఉంటే మహిళలకు, బ్యాంకుకు ఎలాంటి రక్షణ ఉంటుందని మహిళలు మండిపడుతున్నారు. అతడిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: జాక్ పాట్.. లాటరీలో రూ. 40 కోట్లు!

Advertisement

తాజా వార్తలు

Advertisement