(ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో) : తెలంగాణ చీఫ్ బండి సంజయ్ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఏపీలో రెండు రోజుల పర్యటనకు వచ్చిన ఆయన విజయవాడలోని ఇంద్రకీలాద్రిపోయి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం లో కొలువైయున్న కనకదుర్గమ్మ వారి దర్శనానికి ఆదివారం విచ్చేశారు.
వీరికి ఆలయం మర్యాదలతో ఘన స్వాగతం పరికిన అధికారులు అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు. కనకదుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయనకు వేద పండితులు వేద ఆశీర్వచనం ఇవ్వగా ఆలయ ఈ ఈ కోటేశ్వర అమ్మవారి చిత్రపటం ప్రసాదాలను అందజేశారు. ఈ పర్యటనలో ఆయనతోపాటు ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షుడు అడ్డురి శ్రీరామ్ తో పాటు పలువురు బిజెపి అధికారులు ఉన్నారు