Tuesday, November 26, 2024

ఐపీఎల్‌ మెగావేలంలో ఏపీ కుర్రోడు

ఈ నెల 12, 13వ తేదీల్లో బెంగళూరు వేదికగా ఐపీఎల్‌ 2022 మెగావేలం జరగనుంది. ఈ వేలంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన మరో క్రికెటర్‌ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కేఎస్‌ భరత్‌, హైదరాబాద్‌కు చెందిన సిరాజ్‌ తదితరులు ఐపీఎల్‌లో తమ సత్తా చాటారు. ఈక్రమంలో కోనసీమ కుర్రోడు తూర్పు గోదావరి రాజోలుకు చెందిన బండారు అయ్యప్ప మరోసారి మెగావేలానికి ఎంపికయ్యాడు. గతంలో అయ్యప్పను 2019లో ఢిల్లిd క్యాపిటల్స్‌ రూ.20లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది. అయతే క్యాష్‌రిచ్‌ లీగ్‌లో అరంగేట్రం చేసే అవకాశం అతడికి రాలేదు. 2011నుంచి అయ్యప్ప (29) ఆంధ్రజట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

మీడియం పేసర్‌గా, రైట్‌హ్యాండ్‌ బ్యాటర్‌గా అయ్యప్ప తన కెరీర్‌లో ఇప్పటివరకు 32 ఫస్టుక్లాస్‌ మ్యాచ్‌లు, 31ఏ లిస్ట్‌ మ్యాచ్‌లు, 37 టీ20లు ఆడాడు. పేసర్‌గా 167వికెట్లు పడగొట్టాడు. మరోవైపు ఏపీకి చెందిన కెప్టెన్‌ కేఎస్‌ భరత్‌ (రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు), రాయచోటికి చెందిన హరిశంకర్‌రెడ్డి (చెన్నై సూపర్‌ కింగ్స్‌), హైదరాబాద్‌కు చెందిన సిరాజ్‌ (ఆర్సీబీ), భావనక సందీప్‌ (సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌) జట్టుకు ఎంపికయ్యారు. ఈసారి మెగావేలంలో ఏ ఫ్రాంచైజీ వీరిని దక్కించుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..,

Advertisement

తాజా వార్తలు

Advertisement