తూర్పుతీరంలో (ఈస్ట్ కోస్ట్) ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు చేపల వేటను నిలిపివేయనున్నారు. ఈ మేరకు కేంద్ర మత్స్యశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. చేప పిల్లలు పెరిగే సమయం కాబట్టి ప్రతి సంవత్సరం ఏప్రిల్-జూన్ మధ్య 61 రోజులు చేపల వేట నిషేదిస్తారు. దీంతో ఏపీతో పాటు అన్ని కోస్తా రాష్ట్రాల్లో చేపల వేట నిషేదాన్ని అమలు చేయబోతున్నారు. మత్స్యశాఖ జెడి విజయకృష్ణ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని అన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement