Monday, November 18, 2024

అథిష్టానం రాయ’భారం’ – అల‌క వీడ‌ని బాలినేని…

అమరావతి, ఆంధ్రప్రభ: ఇటీవల పార్టీ ప్రాంతీయ సమ న్వయకర్త పదవికి రాజీనామా చేసిన మాజీ మంత్రి, ఒంగోలు శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే మంత్రి పదవి ఇవ్వలేదన్న కారణంతో అలిగిన బాలినేనిని పార్టీ పెద్దలు సముదాయించి సీఎం జగన్‌తో మాట్లాడించి శాంతింపజేశా రు. ఇప్పుడు ఆయన తన ప్రాంతీయ సమన్వయకర్త పదవికి అనూహ్యంగా రాజీనామా చేసి మరోమారు వార్తల్లోకెక్కారు. బాలినేని నుండి వచ్చిన ఊహించని ఈ పరిణామంతో అధిష్టా నం ఆశ్చర్యానికి గురైంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాతోపాటు ఇరుగుపొరుగు జిల్లాల్లో ఆయనకు మంచి పట్టు ఉంది. దీంతో ఆయన్ను బుజ్జగించి శాంతింపజేసేందుకు అధిష్టాన పెద్దలు రంగంలోకి దిగారు. ఈక్రమంలోనే అధిష్టానం నుండి ఆయనతో రాయ’భారం’ సాగిస్తోంది. పార్టీ తరపునుండి ఇద్దరు పెద్దలు ఆయనతో మంతనాలు జరుపుతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే ఆయనతో రెండు, మూడు దఫాలుగా చర్చలు జరిపారని, త్వరలోనే మరోమారు భేటీ జరిగే అవకాశముందని చెబుతున్నారు. అవసరమైతే ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డితో కూడా భేటీ ఏర్పాటు చేసేందుకు అధిష్టానం నిర్ణయించిందని తెలుస్తోంది. అయినప్పటికీ ఆయన మాత్రం తన అలక వీడేట్టు కనిపించడం లేనట్లు కనిపిస్తోంది. దీంతో ప్రాంతీయ సమన్వయకర్త పదవికి రాజీనామాపై డైలమా కొనసాగుతోంది. తాను పార్టీ కార్యక్రమాలకు దూరం కావటం లేదని.. కేవలం రీజనల్‌ కో ఆర్డినేటర్‌ బాధ్యతల నుండి మాత్రమే తప్పుకుంటున్నట్లు- బాలినేని పార్టీ పెద్దలకు స్పష్టం చేస్తున్నారని తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే సోమవారం ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి బాలినేనికి ఫోన్‌ వెళ్లినట్లు సమాచారం. కానీ, బాలినేని తన ఆలోచన మార్చుకోవటానికి సుముఖంగా లేరని తెలుస్తోంది.

అందుకే మనస్థాపానికి గురయ్యారా :
బాలినేని శ్రీనివాస రెడ్డి తిరుపతి, కడప, నెల్లూరు జిల్లాల కో-ఆర్డినేటర్‌ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని పార్టీ ముఖ్య నేతలకు సమాచారం ఇచ్చారు. కొంత కాలంగా చోటు- చేసుకుంటు-న్న వరుస పరిణామాలే దీనికి కారణంగా భావిస్తున్నారు. జిల్లాలో ప్రాధాన్యత తగ్గించేలా చోటు- చేసుకుంటు-న్న వ్యవహారాలపై బాలినేని తీవ్ర మనస్థాపానికి గురైనట్లు- తెలుస్తోంది. జిల్లాలో గతంలో ఇద్దరికి మంత్రి పదవి ఇచ్చారని, రెండో సారి కేబినెట్‌లో తనకు అవకాశం కల్పించాలని బాలినేని అప్పట్లో అధిష్టానినికి పలుమార్లు విన్నవించుకున్నారు. అలాకుంటే తనకు ప్రోటోకాల్‌ ఇబ్బందులు ఎదురవుతాయని, ప్రజలకు పని కూడా చేయలేని పరిస్థితి ఏర్పడుతుందని ఆయన సహేతుకమైన కరాణాలను అధిష్టానానికి వివరించారు. అయినప్పటికీ సొంత మనిషే కదా..చెబితే వింటారన్న ఆలోచనతో అధిష్టానం ఆయనకు రెండో సారి కేబినెట్‌లో బెర్త్‌ ఇవ్వలేదు. దీంతో అప్పటి నుండి ఆయనకు ప్రోటోకాల్‌ ఇబ్బందులు ఎదురవుతూనే వస్తున్నాయి. అయినప్పటికీ ఆయన సర్దుకువస్తున్నారని, మొన్న మార్కాపురం ఘటన ఆయన్ను తీవ్ర మనస్థాపానికి గురిచేసిందని ఆయన వర్గీయులు చెప్పుకుంటున్నారు. దీనికి సంబంధించి బాలినేనిని బుజ్జగించేందుకు తాడేపల్లి నుంచి ఇద్దరు ముఖ్య నేతలు ప్రయత్నించినట్లు- సమాచారం. తన సొంత జిల్లాతో పాటు-గా, ఇంఛార్జ్‌ గా ఉన్న జిల్లాల్లో నేతలు చెప్పిన విషయాలను చేయలేకపోతున్నట్లు- బాలినేని ఆవేదనలో ఉన్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

జగన్‌తోనే ఉంటానంటూ …
ఇదే సమయంలో బాలినేని తాను జగన్‌ కోసం పని చేస్తానని స్పష్టం చేస్తున్నారు. ప్రాంతీయ సమన్వయకర్త పదవి వదులుకోవటానికి అనేక కారణాలు ఉన్నాయని చెప్పినట్లు- తెలుస్తోంది. తన సొంత నియోజక వర్గంతో పాటు-గా పార్టీ కోసం పని చేస్తానని జిల్లా నేతలతో వెల్లడించారు. ఇక నుంచి పూర్తి సమయం ఒంగోలు నియోజకవర్గానికి కేటాయిస్తానని చెప్పుకొచ్చారు. స్వల్ప అస్వస్థతకు గురైన బాలినేని మరో రెండు రోజుల్లో ఒంగోలు వస్తానని చెప్పినట్లు- తెలుస్తోంది. పార్టీ కార్యక్రమాల్లోనూ యధావిధిగా పాల్గొంటానని క్లారిటీ- ఇచ్చారు. కానీ, పార్టీ ఎన్నికలకు సిద్దం అవుతున్న తరుణంలో కీలక బాధ్యతల నుంచి ముఖ్యమంత్రి నమ్మకం పెట్టు-కున్న బాలినేని వంటి నేతలు ఇలాంటి నిర్ణయాలు ఏంటనే చర్చ పార్టీలో వినిపిస్తోంది.

సీఎంతో భేటీ-కి ఛాన్స్‌ :
ఇదిలావుండగా, సీఎంతో బాలినేని సమావేశం అయ్యే అవకాశం కనిపిస్తోంది. తాజా పరిస్థితులపై బాలినేని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డికి వివరించనున్నారని తెలుస్తోంది. బాలినేనికి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గతం కంటే ప్రాధాన్యత తగ్గిందనే అభిప్రాయ వ్యక్తం అవుతోంది. కొద్ది రోజుల క్రితం జరిగిన సమన్యయకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి ఎప్పుడైనా తనను కలవచ్చని స్పష్టం చేసారు. పార్టీలో సమస్యలను పరిష్కారానికి చొరవ చూపించాలని నిర్దేశించారు. ఇప్పుడు పార్టీలో కీలకంగా ఉన్న బాలినేని సీఎంతో సమావేశ సమయంలో ఏం చెబుతారు, సీఎం ఎలా రియాక్ట్‌ అవుతారనేది ఆసక్తికరంగా మారుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement