Friday, November 22, 2024

అల్లుడి యువగళంలో మామ ఎంట్రీ – గంజాయి వద్దు బ్రో అంటూ డైలాగ్స్ ..

అనంతపురం: టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రస్తుతం శింగనమల నియోజకవర్గంలో కొనసాగుతున్నది.. నేటి యాత్రలో లోకేష్ మామ, హీరో బాలకృష్ణ పాల్గొని సంఘీభావం తెలిపారు..నేటి పాద‌యాత్ర‌ను గంజాయి వ‌ద్దు బ్రో అనే కాన్సెప్ట్ తో ముందుకు సాగింది.. మామ‌, అల్లుళ్లు గంజాయి వ‌ద్దు బ్రో రాసి ఉన్న‌టి ష‌ర్ట్స్ ధ‌రించారు.. . ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ..‘‘గంజాయి ఏపీకి కేర్ ఆఫ్ అడ్రస్‎గా మారింది. గత 63 రోజులుగా డ్రగ్స్ సంస్కృతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నా. సీఎం జగన్ పాలనలో ఏపీ గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారింది. ఆఖరికి తిరుమలని కూడా వైసీపీ గంజాయి మాఫియా వదలడం లేదు. చివరకు తిరుమలలో కూడా గంజాయి అమ్ముతున్నారు అంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. గంజాయి వలన యువత భవిష్యత్తు నాశనం అవుతుంది. తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు. టీడీపీ హయాంలో రూ. 40వేల కోట్లు విలువ చేసే గంజాయిని తగలబెడితే ఇప్పుడు ఏకంగా వైసీపీ నాయకులు గంజాయి పంట వేస్తున్నారు. పాదయాత్రలో ఉండగా చంద్రగిరిలో ఒక తల్లి వచ్చి తన కుమార్తె గంజాయికి బానిస అయ్యిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ తల్లి చెప్పిన మాటలు నన్ను కలచివేశాయి. అందుకే గంజాయికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చెయ్యాలని నిర్ణయం తీసుకున్నాం. టీడీపీ హయాంలో పెట్టిన డీఎడిక్షన్ సెంటర్లు కూడా వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేశారు. యువత అంతా డ్రగ్స్, గంజాయికి దూరంగా ఉండాలి అని పిలుపు ఇస్తున్నా.. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే వైసీపీ గంజాయి మాఫియాపై చర్యలు తీసుకుంటాం. గంజాయి వద్దు బ్రో..యువత గంజాయికి దూరంగా ఉండాలి అంటూ’’ లోకేష్ పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement