ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా ఆయన తనయుడు, హీరో, హిందూపురం ఎమ్మెల్యేనందమూరి బాలకృష్ణ ఘాట్ వద్ద ఆయనకు నివాళులు అర్పించి అంజలి ఘటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన తండ్రిని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు.
ఎన్టీఆర్ అంటే నవరసాలకు అలంకారం అని నందమూరి బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ అంటే నవ యువతకు మార్గదర్శనం అని.. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేదల సంక్షేమానికి అనేక పథకాలు తీసుకొచ్చారని తెలిపారు.