Thursday, November 21, 2024

Bail Petitions – లోకేష్ కు స్కిల్ లో స్వల్ప ఊర‌ట ..పైబ‌ర్ గ్రిడ్ బెయిల్ పిటిష‌న్ విచార‌ణ వాయిదా..

అమరావతి: స్కిల్‌ డెవలప్‌మెంట్‌, ఫైబర్‌ గ్రిడ్‌ కేసుల్లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వచ్చే నెల 4కు వాయిదా పడింది. ఇదే స‌మ‌యంలో స్కిల్ కేసులో ఈ నెల నాలుగో తేది వ‌ర‌కూ అరెస్ట్ చేయ‌వ‌ద్దంటూ ఆదేశాలు జారీ చేసింది.. కాగా, ఇన్న‌ర్ రింగ్ రోడ్డు కేసు ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్ పై నేటి ఉద‌యం విచార‌ణ జ‌రిగింది.. అయితే ఈ కేసులో 41ఎ నోటీస్ ఇచ్చి నారా లోకేష్ ను విచారిస్తామ‌ని ప్ర‌భుత్వ త‌రుపు న్యాయ‌వాది కోర్టు కు విన్న‌వించారు.. దీంతో లోకేష్ బెయిల్ పిటిష‌న్ ను తోసిపుచ్చుతూ, విచార‌ణ‌కు నారా లోకేష్ స‌హ‌క‌రించాల‌ని ఆదేశించింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement