Tuesday, November 26, 2024

Bail Petition – ఇన్న‌ర్ రింగ్ రోడ్డు కేసు.. ఏపీ ప్రభుత్వానికి షాక్ – చంద్రబాబుకి ఊరట ..

ఢిల్లీ: ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను రద్దు చేయాలని జగన్ సర్కార్ వేసిన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. దీనిపై ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వలేమని పేర్కొంది. ఈ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌ రద్దు చేయాలన్న ఏపీ ప్రభుత్వ వాదనతో కోర్టు విభేదించింది. ఇదే కేసులో సహ నిందితులపై ఉన్న ఉత్తర్వులు చంద్రబాబుకూ వర్తిస్తాయని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement